
గురు గ్రహం ఒక రాశిలో దాదాపు సంవత్సరం ఉంటారు. 12 రాశుల్లో సంచారం చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ గ్రహం ప్రతి నెల నక్షత్ర సంచారం చేస్తుంటాడు. అయితే అతి త్వరలో అక్టోబర్ 8న గురు గ్రహం నక్షత్ర సంచారం చేయనుంది. ఆశ్లేష నక్షత్రంలోని నాలుగొవ దశలోకి అడుగు పెట్టనుంది. అయితే ఇది 12 రాశులపై ప్రభావం చూపగా దీని వలన నాలుగు రాశుల వారికి కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది చాలా మంచి సమయం ఇది. ఈ రాశి వారికి గురుడు రాశ్యాధిపతి కావడంతో ఈ సంచారం అత్యంత శుభప్రదం. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడతారు, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మిథున రాశి : మిథున రాశి వారికి పట్టింది బంగారం ముట్టింది ముత్యమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ధన స్థానంలో గురు ప్రభావం పడుతుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. పాత అప్పులు తీరిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మాటకు విలువ పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం, విదేశీ అవకాశాలు కలిసొస్తాయి.

మీన రాశి : వీరికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీన రాశికి గురుడు అధిపతి. ఈ నక్షత్ర మార్పుతో మీకు రాజయోగం పడుతుంది. అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్త వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి పెట్టుబడులకు ఇది మంచి సమయం. గురు సంచారం వలన కష్టాలు తీరిపోయి మంచి రోజులు మొదలవుతాయి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి తగ్గి, ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారులకు చాలా అద్భుతంగా ఉంటుంది.