
లడఖ్ : వేసవి ముగింపు సమయంలో తప్పక సందర్శించాల్సిన అందమైన ప్రదేశంలో లడఖ్ ముందు వరసలో ఉంటుంది. ఇక్కడి వాతావరణం ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి అందమైన ముంచు ఎడారి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. నిర్మల మైన ఆకాశం, సున్నా వర్షాపాతం ఉన్న ఈ ప్రాంతం చూడాటానికి రెండు కళ్లు చాలవు. ముఖ్యంగా జూన్‌లో వాతావరణం కాస్త తేమగా ఉంటుంది కాబట్టి, ఇది చూడటానికి అద్భుతమైన సమయం ఇదే, అలాగే ఇక్కడి పాంగోగ్ సరస్సు, నుబ్రా లోయా, అందమైన ఎత్తైన పర్వతాలు మంచి అనుభూతిని ఇస్తాయి.

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్ : కొండల రాణి అనే పిలవబడే డార్జిలింగ్ అంతర్జాతీయ పర్యాటక ప్రాంతం. ఇక్కడి అందాలను ఆస్వాదించాలి అనుకుంటే , జూన్ మాసం చాలా అనుకూలమైనది. దట్టమైన పొగ, చిన్న చిన్న చిరు జల్లులు ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇది చాలా మంచి సమయం. ఎత్తైన కొండలు, అందమైన జలపాతాలు, అడవి మధ్యలో ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును, జూన్‌లో తప్పక సందర్శించాల్సిన ప్రదేశంలో ఇది ముందుంటుంది.

ఊటీ , తమిళనాడు : ఊటీ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా అద్భుతమైన, అందమైన ప్రదేశాల్లో ఇదొక్కటి, వేసవిలో ముఖ్యంగా జూన్ మాసంలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతంలో ఇది ముందుంటుంది. జూన్ నెలలో ఆహ్లాదకరమైన వాతావరణం, తేమతో కూడి ఉంటుంది, ఉదయం పూట పొగమంచు, చల్లని ఉష్ణమండలపు గాలులు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. అలాగే కొండలు, పచ్చని అడవి మధ్య రైలులో ప్రయాణించడం, చీకటి సొరంగాలు, కాఫీ తోటలు ఇవన్నీ కూడా మానసిక ఆనందాన్ని పెంపొందిస్తాయి.

మున్నార్, కేరళ : ప్రకృతి సహజ సౌందర్యాన్ని అనుభవించాలనుకునే వారికి , ముఖ్యంగా చిరు జల్లుల్లో ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి మున్నార్ కేరళ బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. జూన్ నెలలో ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎత్తైన కొండలు, వర్షపు గాలులు, కొండలపై వాలిన మేఘాలు, అందమైన తేయాకు తోటల్లో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఇది.

కూర్గ్, కర్ణాటక : జూన్ నెలలో కూర్గ్‌లో ఉష్ణోగ్రత 14°C నుండి 25°C వరకు చాలా సౌకర్యవంతంగా చల్లబడుతుంది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు విశాలమైన కాఫీ తోటలను పూర్తిగా కప్పేస్తుంది, చిన్న చిన్న చిరుజల్లులు మధ్య ఒక కాఫీ తాగుతూ, అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి ఇది బెస్ట్ సమయం. జూన్ నెలలో కూర్గ్ వాతావరణం చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఇక్కడి బియ్యంపిండితో చేసిన చపాతీలు తింటే రుచి అదిరిపోతుంది.