
ఊర్లలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జబర్దస్త్ లో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ జబర్దస్త్ కమెడియన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్కిట్స్ లో తను రాసిన పంచ్ డైలాగ్స్ కు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి పేరు సంపాదించుకున్న జబర్దస్త్ కమెడియన్ బాబు ( డేగల బాబు ) నిజ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం.

షార్ట్ ఫిల్మ్స్ నుంచి తన కెరియర్ మొదలు పెట్టి సినిమా డైరెక్టర్ వరకు ఎదిగాడు. ఎదిగేటప్పుడు ఎవరికైనా దెబ్బలు తగలడం సహజం. బాబుకు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అవన్నీ తట్టుకుని నిలబడి తన రాతలను కేవలం షార్ట్ ఫిల్మ్స్ దగ్గరే ఆపకుండా పాటలకు డైరెక్షన్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

ఆ తరవాత 2023 లో ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం చేసి మిలియన్ల మందికి చేరువయ్యాడు. ఈ సిరీస్ తో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకున్నాడు. ఇక ఇప్పుడు స్టార్ యాక్టర్స్ తో సినిమా తీసే వరకు తన ప్రయాణం వెళ్ళింది. ఈ కొత్త మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

జబర్దస్త్ బాబు డైరెక్షన్లో వైవా హర్ష లీడ్ రోల్లో నటించిన " లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " సినిమా మరి కొద్దీ రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. మిలియన్ కి పైగా వ్యూస్ తెచ్చుకుని యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. సూపర్ ఉంది , మూవీ కోసం వేచి చూస్తున్నాం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసున్నారు

జబర్దస్త్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు బాబు. ఇప్పుడు సినిమా డైరెక్షన్లో కూడా తన సత్తా చూపించడానికి సిద్దమయ్యాడు. చూడాలి మరి " లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " సినిమా ప్రేక్షకులను ఎంత బాగా అలరిస్తుందో? ఈ సినిమాలో జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఆది, శ్రీ విద్య తదితర నటి నటులు నటించారు.