
నీటి కల్తీ పరీక్ష (Water Test): ఒక పాలిష్ చేసిన రాయి లేదా ప్లేటును కొంచెం వాలుగా ఉంచి, దానిపై ఒక చుక్క పాలను వేయండి. స్వచ్ఛమైన పాలు అయితే తెల్లటి మచ్చను లేదా గీతను వదులుతూ నెమ్మదిగా కిందకు జారుతాయి. నీళ్లు కలిపిన పాలు ఎటువంటి గుర్తు లేకుండా వేగంగా కిందకు ప్రవహిస్తాయి.

డిటర్జెంట్ పరీక్ష (Detergent Test): కొద్దిగా పాలను ఒక గాజు సీసాలో పోసి బాగా కుదిపండి (Shake). పాలలో డిటర్జెంట్ లేదా షాంపూ ఉంటే దట్టమైన నురుగు వస్తుంది. ఆ నురుగు చాలా సేపటి వరకు తగ్గకుండా అలాగే ఉంటే, ఆ పాలు కచ్చితంగా కల్తీ అయినట్లే.

స్టార్చ్ గుర్తింపు (Starch Test): పాలలో పిండి పదార్థాలు కలిపారో లేదో తెలియాలంటే, పాలను మరిగించి చల్లార్చాలి. అందులో రెండు చుక్కల అయోడిన్ ద్రావణం (Iodine solution) కలపాలి. పాలు నీలం రంగులోకి మారితే అందులో స్టార్చ్ కలిపారని అర్థం.

సింథటిక్ పాలు (Synthetic Milk): సింథటిక్ పాలు చేదు రుచిని కలిగి ఉంటాయి. వీటిని వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారుతాయి. అలాగే అరచేతిలో వేసుకుని రుద్దినప్పుడు సోపు లాంటి అనుభూతిని కలిగిస్తాయి.

యూరియా పరీక్ష (Urea Test): యూరియా కలిపిన పాలు ఘాటైన వాసన లేదా చేదు రుచిని కలిగి ఉంటాయి. ఒక టీస్పూన్ పాలలో అర టీస్పూన్ సోయాబీన్ పొడి కలిపి బాగా ఊపాలి. 5 నిమిషాల తర్వాత ఎర్రటి లిట్మస్ పేపర్‌ను అందులో ముంచితే, అది నీలం రంగులోకి మారితే అందులో యూరియా ఉందని నిర్ధారించుకోవచ్చు.

అలాగే పాలు కూడా సాయంత్రం వేళ మీ ఇంటికి వచ్చి పాలను అడిగితే ఇవ్వకండి. ఇంకా పెరుగు, ఉప్పు కూడా ఎవరికీ దానం చెయ్యకండి. తెలుపు రంగు వస్తువులను ఎవరికి ఇవ్వకపోవడమే మంచిది.