మీకు తెలుసా.. బొప్పాయి వీరికి మస్త్ డేంజర్.. తింటే ఆ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..

Updated on: Aug 26, 2026 | 8:45 AM

ఏడాదంతా విరివిగా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. బరువు తగ్గాలనుకునే వారైనా, మలబద్ధకంతో బాధపడేవారైనా బొప్పాయిని అమృతంగా భావించి రోజూ లాగించేస్తుంటారు. అయితే ఎంత మేలు చేసే పండైనా రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుందని, కొన్ని తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బొప్పాయితో కలిగే అసలైన ఆరోగ్య లాభాలేంటి? ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలి? అనేది తెలుసుకుందాం..

1 / 5
ఫోర్టిస్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శుభమ్ వాత్స్య ప్రకారం.. బొప్పాయిలో పాపైన్ అనే ప్రత్యేక జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తీసుకునే ఆహారంలోని ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేయడానికి సహకరిస్తుంది. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులోని అధిక ఫైబర్ ప్రేగు కదలికలను సులభతరం చేసి మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.

2 / 5
జీర్ణశక్తితో పాటు బొప్పాయి శరీర రోగనిరోధక శక్తిని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి, ఎ శరీరానికి వ్యాధినిరోధక రక్షణ కవచంలా పనిచేస్తాయి. బొప్పాయిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడగా.. బీటా కెరోటిన్ కంటి చూపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అధిక కేలరీల స్నాక్స్‌కు బదులుగా బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలిగి బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

3 / 5
అయితే బొప్పాయి ఎంతటి ప్రయోజనకరమైన పండైనా.. దానిని ప్రతిరోజూ అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు నిత్యానంద్ శ్రీ హెచ్చరిస్తున్నారు. కారణం లేకుండా రోజూ బొప్పాయి తింటే శరీర సహజ జీర్ణశక్తి బలహీనపడే ప్రమాదం ఉంది. హెవీ ఫుడ్ తిన్నప్పుడు లేదా జీర్ణ సమస్యలు అనిపించినప్పుడు మాత్రమే బొప్పాయిని అప్పుడప్పుడు తీసుకోవడం ఉత్తమమని, దీనిని సమతుల్య ఆహారంలో భాగంగా మితంగానే తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

4 / 5

ముఖ్యంగా కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు బొప్పాయి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పచ్చి లేదా అరకొర పండిన బొప్పాయిలో లేటెక్స్ శాతం అధికంగా ఉండటం వల్ల గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని పాపైన్, లేటెక్స్ కొందరిలో తీవ్రమైన అలెర్జీలకు దారితీయవచ్చు. అంతేకాకుండా అధిక మొత్తంలో తింటే కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలి.

5 / 5
ఏ పండైనా అమితంగా తింటే అనర్థాలకు దారితీస్తుందన్న వాస్తవాన్ని గ్రహించి బొప్పాయిని మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. సర్వరోగ నివారిణిగా కాకుండా మన వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా సరైన మోతాదులో బొప్పాయిని డైట్‌లో చేర్చుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us