Skincare: ఇన్నాళ్లు పొరపాటు చేశామా?.. ఇలాంటి చర్మం ఉన్నవారు కొబ్బరి నూనె అస్సలు వాడొద్దట!

Updated on: Sep 12, 2026 | 8:53 AM

మన ప్రాచీన కాలం నుంచి కొబ్బరి నూనె అనే సంప్రదాయ చర్మ సంరక్షణలో భాగమై ఉంది. ఆయుర్వేదంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. కానీ ఇది ప్రతి ఒక్కరి చర్మానికి ఒకేలా పనిచేయదని నిపుణులు చెబుతన్నారు. చర్మ తత్వాన్ని బట్టి దీని ప్రభావం మారుతుందని సూచిస్తున్నారు. కాబట్టి కొబ్బరి నూనెను ఎలాంటి చర్మం ఉన్నవారు వాడాలి, ఎవరు వాడకూడదో ఇక్కడ క్లారిటీగా తెలుసుకుందాం

1 / 5
అందమైన , మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం కొందరు ప్రస్తుతం ఖరీదైన బ్యూటీ ప్రాడక్ట్స్‌ వాడితే మరి కొందరు మాత్రం.. ప్రాచీన సాంప్రదాయ పద్దతులను వాడుతుంటారు. వాటిలో ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఎన్నో ఎళ్లుగా ఉపయోగిస్తున్న కొబ్బరి నూనెను కూడా చాలా మంది ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి వాడుతారు. కానీ ఇది ప్రయోజనకరమైనదే అయినప్పటికీ.. అందరికీ మంచిది కాదని నిపుణులు చెబుతన్నారు. చర్మం రకాన్ని బట్టి దీన్ని ఉపయోగించాలి సూచిస్తున్నారు.

2 / 5
కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలు:  కొబ్బరి నూనె మన చర్మానికి మాయిశ్చరైజర్ పనిచేస్తుంది. కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ చర్మంపై ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు మనం వేసుకున్న హెవీ మేకప్‌ను తొలగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.అలాగే చర్మం పొడిబారాడాన్ని తగ్గించి ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుంది.

3 / 5
చర్మ రకాన్ని బట్టి వాడుక: పొడిబారిన చర్మం ఉండే వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖం, శరీరంపై దురద, పొడిబారిన తనాన్ని తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఒక వేళ మీది అయితీ స్కిన్ అయినా, మొటిమలు ఉన్నా కొబ్బరి నూనెను అస్సలు మీ ముఖానికి అప్లై చేయవచ్చు. ఎందుకంటే ఇది ముఖంపై ఉన్న రంధ్రాలను మూసివేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, మొటిమలు ఉన్న వారి దీనిని వాడితే సమస్య మరింత పెరగొచ్చు.

4 / 5
కాంబినేషన్ చర్మం: ఇలాంటి చర్మం ఉన్నవారు లిమిట్‌లో కొబ్బరి నూనెను ఉపయోగించాలి. అంటే మీ ముఖంపై పొడిగా ఉండే భాగాలలో మాత్రమే అతి తక్కువ మోతాదులో కొబ్బరి నూనెను రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇతర సమస్యలు రాకుండా నివారించవచ్చు. అలాగే ఎప్పుడూ బాగా శుద్ది చేసిన ఎక్స్‌ట్రా వర్జిన్ కొబ్బరి నూనెను మాత్రమే వాడండి.

5 / 5
అలాగే ఈ కొబ్బరి నూనెను వాడేప్పుడు కొన్ని  జాగ్రత్తలు పాటించాలి. కేవలం 2–3 చుక్కల మాత్రమే చేతుల్లోకి తీసుకుని, కాస్త రుద్ది గోరువెచ్చగా చేసి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ముఖ్యంగా జిడ్డు చర్మం లేదా మొటిమల సమస్య ఉన్నవారు కొబ్బరి నూనెను రాత్రంతా ముఖంపై అలాగే ఉంచుకోకూడదు. ఇలా చేస్తే మొటిమలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకపై కొబ్బరి నూనె వాడే విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే దేన్నైనా వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకొండి.. Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం!

Loading...
Unable to load recommendations.
Follow Us