చలికాలంలో మంచు కొండల్లో.. ఈ ప్రయాణం మీకు స్వర్గమే

Updated on: Nov 12, 2026 | 10:47 AM

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అయితే మీరు కూడా ఈ శీతాకాలంలో ఆనందంగా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ అద్భుతమైన సమాచారం. చాలా తక్కువ సమయంలో అద్భుతమైన ప్రదేశాలు చుట్టి రావచ్చు అంట. అది ఎలా అంటే?

1 / 5
బడ్జెట్ లో చలికాలం ట్రిప్ వేయాలనుకునే వారికి IRCTC టూరిజం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ వింటర్ లో  హిమాచల్ ప్రదేశ్ లో వింటర్ టూర్ వెళ్లాలనుకునే వారి కోసం సిమ్లా మనాలి వింటర్ స్పెషల్ ఫ్లైట్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కోడ్ SMA72, ఇది 2026 నవంబర్ 26న చెన్నై నుంచి బయలుదేరుతుంది. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగే ఈ యాత్రలో సిమ్లా, కుఫ్రీ, మనాలి, చండీగఢ్ వంటి ప్రధాన ప్రదేశాలను చూడవచ్చు. ఒక్కరికి రూ.48,250 నుంచి ధర ప్రారంభమవుతుంది, ఇందులో విమాన ప్రయాణం, హోటల్ బస, భోజనం, సైట్ సీయింగ్ ఉంటాయి.

2 / 5
ఈ ఎనిమిది రోజుల యాత్రలో సిమ్లాలో రెండు రాత్రులు, మనాలిలో మూడు రాత్రులు, చండీగఢ్ లో రెండు రాత్రులు బస ఏర్పాటు చేశారు. చండీగఢ్ లో సుఖ్నా లేక్, రాక్ గార్డెన్, రోజ్ గార్డెన్ వంటివి చూసిన తర్వాత యాత్ర సిమ్లాకు సాగుతుంది. శిమ్లాలో మాల్ రోడ్, జాఖూ ఆలయం, కుఫ్రీ, గ్రీన్ వ్యాలీ వంటి ఆకర్షణలు ఉంటాయి. అంతేకాకుండా ప్రసిద్ధ కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ లో ప్రయాణించే అవకాశం కూడా ఈ ప్యాకేజిలో కల్పించారు.

3 / 5
మనాలి వైపు ప్రయాణంలో సుందర్ నగర్ లేక్, పాండో డ్యామ్, కులు శాలువా ఫ్యాక్టరీ వద్ద ఆగుతారు. మనాలిలో మూడు రాత్రులు ఉండి హిడింబా దేవి ఆలయం, మను ఆలయం, వన్ విహార్, క్లబ్ హౌస్, బౌద్ధ మఠం, టిబెటన్ మార్కెట్ చూడవచ్చు. వాతావరణం అనుకూలిస్తే అటల్ టన్నెల్, సోలాంగ్ వ్యాలీ కూడా చూపిస్తారు. చివరగా చండీగఢ్ నుంచి చెన్నైకి విమానంలో తిరిగి రావడంతో యాత్ర ముగుస్తుంది.

4 / 5
ధర విషయానికి వస్తే గదిలో ఉండే వారి సంఖ్యను బట్టి ఛార్జీలు మారుతాయి. ఒంటరిగా ఉంటే ఒక్కరికి రూ.73,500, ఇద్దరు కలిసి ఉంటే ఒక్కరికి రూ.54,800, ముగ్గురు కలిసి ఉంటే ఒక్కరికి రూ.52,000 అవుతుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు మంచంతో రూ.44,600, మంచం లేకుండా రూ.39,600 గా నిర్ణయించారు. ఇద్దరు కలిసి వెళ్తే మొత్తం రూ.1,09,600, ముగ్గురు వెళ్తే రూ.1,56,000 అవుతుంది. మధ్యాహ్న భోజనం, ఎంట్రీ ఫీజులు, షాపింగ్, టిప్స్ వంటివి ఈ ధరలో ఉండవు.

5 / 5
బడ్జెట్ లో యాత్ర చేయాలనుకునే వారు ఫ్లైట్ టికెట్లు ముందే బుక్ చేసుకోవడం, ముగ్గురు కలిసి గది పంచుకోవడం, లోకల్ బస్సులు, షేర్డ్ క్యాబ్ లు వాడటం, అనవసరమైన సాహస క్రీడలను తగ్గించడం ద్వారా ఖర్చును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ప్యాకేజీలో చెన్నై-చండీగఢ్ రానుపోను ఫ్లైట్లు, ఏడు రాత్రుల హోటల్ బస, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, ఏసీ టెంపో ట్రావెలర్ లో సైట్ సీయింగ్, టాయ్ ట్రైన్ ప్రయాణం, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. బుకింగ్ కోసం IRCTC టూరిజం అధికారిక వెబ్ సైట్ లో SMA72 కోడ్ తో పూర్తి వివరాలను అందించడం జరిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us