అబ్బ సాయిరాం.. గ్యాస్ సరఫరాపై కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. సిలిండర్లపై టెన్షనొద్దు..

Updated on: Mar 12, 2026 | 7:30 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ దేశంలో వంట గ్యాస్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వంట గ్యాస్‌ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. బుకింగ్‌ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్‌ డెలివరీ అవుతుందని పేర్కొంది. LPG ఉత్పత్తిని 25% పెంచామని.. హార్ముజ్‌ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురు దిగుమతి చేసుకుంటున్నట్టు పేర్కొంది. హార్ముజ్‌ నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించినట్టు తెలిపింది.

1 / 5
పశ్చిమాసియాలో రోజురోజుకూ యుద్ధం ముదురుతోంది. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ దాడులతో ఆ దేశాల నుంచి భారత్‌కు రావాల్సిన చమురు నిల్వలు నిలిచి పోయాయ. ఈ నేపథ్యంలో భారత్ సహా అనేక దేశాలల్లో పెట్రోల్,  డీజిల్, గ్యాస్ కొరతలు ఏర్పడ్డాయి. అయితే ఈ కొరతను అదిగమించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

2 / 5
హర్మోజ్ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురు కొనుగోలు చేయడం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ సిలిండర్ల విషయంలో వినియోగదారులు ఎవరూ భయపడాల్సిన పనిలేదని తెలిపింది.

3 / 5
వినియోగదారులు బుక్‌ చేసుకున్న రెండున్నర రోజుల వ్యవధిలోనే మీరు బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి చేరుతుందని పేర్కొంది. గల్ఫ్‌ దేశాల నుంచి రావాల్సిన చములు నిల్వలు ఆగిపోయినప్పటికీ.. ఇతర మార్గాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నట్టు తెలిపింది.

4 / 5
విదేశాల నుంచి చమురు దిగుమతి, దేశంలో ఉన్న గ్యాస్ నిల్వలపై  పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ భారత్‌కు చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని హర్మోజ్ జలసంధిలో సంబంధం లేని మార్గాల ద్వారా చమురును సేకరిస్తున్నామని.. హర్మోజ్ నుంచి వచ్చే దానికంటే ఎక్కకే సేకరిస్తున్నట్టు పేర్కొంది.

5 / 5
ప్రభుత్వం చేపట్టి ఈ చర్యల వల్ల ప్రస్తుతం దేశంలో సుమారు 25శాతం ఎల్పీజీ నిల్వలు పెరిగాయని పేర్కొంది. కాబట్టి గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఇంతకు ముందులానే బుక్‌ చేసుకున్న ఒకటి, రెండ్రోజులకే గ్యాస్ గెలివరీ అవుతుందని తెలిపింది.

Follow Us