వేసవి తాపానికి విరుగుడు తాటి ముంజలు.. ఈ పండు ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Updated on: Apr 09, 2026 | 12:10 PM

వేసవిలో ప్రకృతి మనకు అందించే అద్భుతమైన వరం తాటి ముంజలు (Ice Apples). వీటిని తినడం వల్ల కలిగే అపరిమితమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. ఎండాకాలం రాగానే నోరూరించే తాటి ముంజలు ప్రతి వీధిలోనూ దర్శనమిస్తాయి. కేవలం చలవ కోసమే కాదు, సంపూర్ణ ఆరోగ్యం కోసం కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఇంగ్లీష్‌ లో ఐస్ యాపిల్ అని పిలుస్తారు. మండుతున్న ఎండల నుండి ఉపశమనం పొందడానికి తాటి ముంజలు ఎందుకు ఉత్తమమైనవో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5
శరీరానికి సహజమైన కూలెంట్: తాటి ముంజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. శరీరానికి చలవ చేసి డీహైడ్రేషన్ నివారిస్తుంది. తాటి ముంజెల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండల వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి నీరసపడినప్పుడు, ముంజెలు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను సహజంగా నియంత్రించి, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి.

2 / 5
జీర్ణక్రియ మెరుగుదల: పొట్ట సమస్యలతో బాధపడేవారికి తాటి ముంజలు ఒక దివ్యౌషధం. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలను నివారించడంలో ఇవి సహాయపడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే వికారం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇవి మేలు చేస్తాయి.

3 / 5
పోషకాల గని: తాటి ముంజల్లో విటమిన్ ఎ, బి, సి లతో పాటు పొటాషియం, ఐరన్, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, మెటబాలిజం మెరుగుపడటానికి తోడ్పడతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక తక్కువ క్యాలరీల ఆహారం. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

పోషకాల గని: తాటి ముంజల్లో విటమిన్ ఎ, బి, సి లతో పాటు పొటాషియం, ఐరన్, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, మెటబాలిజం మెరుగుపడటానికి తోడ్పడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక తక్కువ క్యాలరీల ఆహారం. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

4 / 5
చర్మ ఆరోగ్యం:  ముఖ్యంగా వేసవిలో వచ్చే చర్మ సమస్యలైన చెమటకాయలు, దద్దుర్లు తగ్గించడానికి ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది. ముంజలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వచ్చే చెమటకాయలు, దురద, ఎండ వల్ల కలిగే చర్మ సమస్యలను తగ్గిస్తాయి. వేసవిలో వచ్చే చెమటకాయలు లేదా ఎండ వల్ల చర్మంపై వచ్చే మంటను తగ్గించడానికి ముంజెలలోని నీరు లేదా గుజ్జును చర్మంపై రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
జాగ్రత్తలు: చాలామంది తాటి ముంజలపై ఉండే పైన సన్నని పొరను తీసి తింటారు. కానీ, ఆ పొరలోనే అధిక పోషకాలు, ఫైబర్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముంజలు మరీ ముదిరిపోకముందే తింటే ఆరోగ్యానికి మరింత శ్రేయస్కరం. కృత్రిమ శీతల పానీయాల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే తాటి ముంజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ వేసవిలో మీ డైట్‌లో వీటిని తప్పకుండా భాగం చేసుకోండి.

Follow Us