వార్నీ.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఈ గింజలను నానబెట్టి రాస్తే.. జట్టు వద్దన్నా పెరుగుతుందట!

Updated on: Sep 30, 2026 | 7:25 PM

ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు కావాలిని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిని జుట్టు రాలడం, పలుచబడటం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఈ సమస్యను దూరం చేసేందుకు జనాలు ఖరీదైన ఆయిల్స్‌ వాడుతూ ఉంటారు. కానీ మన కిచెన్‌లో దొరకే మెంతులతో ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మెంతులతో జుట్టు సమస్యలకు ఎలా చెక్‌ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
మెంతుల్లో జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నికోటినిక్ యాసిడ్ రక్తనాళాలను వ్యాకోచింపజేయడం వల్ల కుదుళ్లకు అవసరమైన ప్రోటీన్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

2 / 5
మెంతులలో ఉండే మరో కీలక సమ్మేళనం లిసితిన్. ఇది తలపైన ఉండే చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. వేసవి వేడికి గురికావడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల తల చర్మం పొడిబారి జుట్టు విరిగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. మెంతుల్లోని లిసితిన్ మాడును తేమగా ఉంచి పొడిబారకుండా కాపాడుతుంది. దీనివల్ల కుదుళ్లు ఆరోగ్యంగా మారి జుట్టు ఊడకుండా, విరిగిపోకుండా ఉంటుంది.

3 / 5
మెంతుల జెల్ జుట్టుకు అందించే మేలు కేవలం నమ్మకం మాత్రమే కాదు, శాస్త్రీయంగా ధ్రువీకరించబడినది కూడా. 1972 లోనే ఫ్రాన్స్ దేశంలోని పారిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు నిర్వహించారు. వారి పరిశోధనల్లో మెంతుల్లో ఉండే జుట్టు సంరక్షణ గుణాలు స్పష్టంగా నిరూపితమయ్యాయి. మెంతులు జుట్టు పెరుగుదలకు, కుదుళ్ల బలానికి ఎంతగానో తోడ్పడతాయని ఆ పరిశోధనలు స్పష్టం చేశాయి.

4 / 5
అయితే ఈ మెంతులను జుట్టుకు వాడుకునేందుకు.. ఒక గుప్పెడు మెంతులను తీసుకొని వాడడానికి 5-6 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నానిన మెంతులను తగినంత నీటితో కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బితే జిగురుగా ఉండే జెల్ పేస్ట్ తయారవుతుంది. కావాలనుకుంటే ఈ పేస్ట్‌ను వడగట్టి కేవలం జిగురు ద్రవాన్ని కూడా ఉపయోగించవచ్చు.

5 / 5
ఇలా రెడీ చేసుకున్న మెంతుల జెల్ పేస్ట్‌‌ను జుట్టు కుదుళ్లకు, మాడుకు బాగా పట్టించి 30 నుంచి 45 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది పూర్తిగా సహజమైన పద్ధతి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్కెట్ ఉత్పత్తులతో పోలిస్తే ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ చిట్కాతో కుదుళ్లకు రక్తప్రసరణ పెరిగి జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us