
చాలా మంది ఇంట్లో టైల్స్ క్లీన్ చేసేందుకు వెనిగర్ ,నిమ్మరసం వంటి సహజ క్లీనర్లుగా వాడుతారు. ఇవి మంచివే అయినప్పటికీ వాటిలోని ఆమ్ల గుణం మార్బుల్ పై పొరను దెబ్బతీస్తుంది. దీనివల్ల మార్బుల్ మెరుపు తగ్గి, గరుకుగా మారుతుంది. అప్పుడు మార్బుల్‌పై ఏర్పడిన రంధ్రాలల్లోకి దుమ్ము చేరి దీర్ఘకాలంలో అది పసుపు రంగులోకి మారుతుంది. కాబట్టి మార్బుల్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన క్లీనర్లను మాత్రమే వాడండి.

చాలా మంది ఇంట్లోని బాత్రూమ్, వంటగది వంటివి శుభ్రం చేసేందుకు వాడిన మాప్‌తోనే మార్బుల్స్‌ను కూడా క్లీన్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న మురికంతా మార్బుల్స్‌పైకి చేరుతుంది. కాబట్టి, వేరే రూమ్‌లను క్లీన్ చేసేందుకు వాడే మాప్‌ను కాకుండా మార్బుల్ క్లీన్ చేసేందుకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన మాప్‌ను వాడండి.

మార్బుల్ త్వరగా పసుపు రంగులోకి మారకుండా ఉండాలంటే దానికి సీలింగ్ వేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణంగానే మార్బుల్స్‌పై చిన్న రంద్రాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో మీరు సీలర్ వేయకపోతే ఇంట్లో వాడే నీరు, నూనె, దుమ్ము నేరుగా రాయి లోపలికి ఇంకిపోయి అవి పుసుపు రంగులోకి మారుతాయి. కాబట్టి ఓ మంచి క్వాలిటీ పెనెట్రేటింగ్ సీలర్‌ను మార్బుల్స్‌కు వేయండి.

మార్బుల్స్ ఎక్కవ రోజులు పాడవకుండా ఉండాలంటే వాటిపై నీరు లేదా నూనె వంటివి పడినప్పుడు వెంటే తుడిచేయండి. లేదంటే ఎక్కువసేపు నీరు నిలవడం వల్ల తేమ పెరిగి పసుపు లేదా గోధుమ రంగు మరకలుగా మారుతుంది. కాబట్టి నీరు లేదా ఇతర ద్రవాలను ఎక్కవసేపు మార్బుల్స్‌పై ఉంచకండి.

పూర్య కిరణాలు నేరుగా ఎక్కవ రోజులు మార్బుల్స్‌పై పడితే అవి రంగు మారే అవకాశం ఉంది. కాబట్టి కిటికీల దగ్గర లేదా ఆరుబయట ఉండే మార్బుల్‌పై ఎండ తగలకుండా కర్టెన్లు, బ్లైండ్స్ లేదా UV-ఫిల్టరింగ్ ఫిల్మ్‌లను ఏర్పాటు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఎండ తీవ్రత తగ్గి మార్బుల్ రంగును కోల్పోకుండా ఉంటుంది.