పల్లెటూరి స్టైల్.. నాటుకోడిని తలదన్నే బొంత కోడి బిర్యానీ.. ఇలా చేస్తే ఇక తినడం ఆపరు

Updated on: Aug 09, 2026 | 5:05 PM

పల్లెటూరి స్టైల్లో బొంత కోడి బిర్యానీ చేసి తింటే నాటు కోడిని కూడా మర్చిపోతారు. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే బయట బిర్యానీలు వైపు అస్సలు చూడరు. ఇది అంత టేస్టీగా ఉంటుంది మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
పల్లెటూరి స్టైల్లో బొంత కోడి బిర్యానీ  చేసి తింటే నాటు కోడిని కూడా మర్చిపోతారు.  మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే  బయట బిర్యానీలు వైపు అస్సలు చూడరు. ఇది అంత టేస్టీగా ఉంటుంది మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.

2 / 5
కావాల్సిన పదార్ధాలు : ముప్పావు కిలో బొంత కోడి ముక్కలు, అర కిలో బాస్మతి బియ్యం, రెండు ఉల్లిపాయలు, మూడు టమోటాలు, 5 పచ్చిమిర్చి,   చిటికెడు పసుపు,  ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి,  రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు కప్పుల పెరుగు,  అర కట్ట పుదీనా, కట్ట కొత్తిమీర , రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్  కారం, ధనియాల పొడి, నాలుగు బిర్యానీ ఆకు, నాలుగు లవంగాలు, రెండుయాలకులు, దాల్చినచెక్కను తీసుకోవాలి.

3 / 5
మ్యారీనేషన్ : ముందుగా బొంత కోడి ముక్కలను రెండు మూడు సార్లు బాగా కడిగి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, కొద్దిగా కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 30 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 
ఆ తర్వాత బాస్మతి బియ్యాన్ని తీసుకుని 20 నిమిషాల పాటు కడిగి ఉడికించాలి.

మ్యారీనేషన్ : ముందుగా బొంత కోడి ముక్కలను రెండు మూడు సార్లు బాగా కడిగి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, కొద్దిగా కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 30 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాస్మతి బియ్యాన్ని తీసుకుని 20 నిమిషాల పాటు కడిగి ఉడికించాలి.

4 / 5

ఇక ఇప్పుడు చిన్న పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి రంగు మారే వరకు 
వీటిని వేయించాలి. ఆ తరవాత దీనిలో కట్ చేసిన టమోటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా  వేసి మెత్తగా అయ్యాక ముందుగా మేరినేట్ చేసిన బొంత కోడి ముక్కలు వేసి దీనిని మెత్తగా ఉడికించాలి.

ఇక ఇప్పుడు చిన్న పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి రంగు మారే వరకు వీటిని వేయించాలి. ఆ తరవాత దీనిలో కట్ చేసిన టమోటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా అయ్యాక ముందుగా మేరినేట్ చేసిన బొంత కోడి ముక్కలు వేసి దీనిని మెత్తగా ఉడికించాలి.

5 / 5
ఇంకా దీనిలో మీరు ముందుగా పక్కన పెట్టిన  బియ్యం వేసి ఆ తర్వాత దీనిలో  పుదీనా, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అర టీ స్పూన్ గరం మసాలా, ఇంకా  కొంచం కొద్దిగా నిమ్మరసం కూడా దీనిలో వేయాలి. ఆ తర్వాత సన్నని  మంటపై 15 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కిందకు  దించేయాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us