Dry Fish Pickle: అమ్మమ్మల కాలం నాటి ఎండు చేపల నిల్వ వేపుడు.. ఇలా చేస్తే అన్నం క్షణాల్లో ఖాళీ!

Updated on: Oct 22, 2026 | 8:03 PM

నాన్‌వెజ్ ప్రియులలో చేపలకు ప్రత్యేక ఫ్యాన్స్ ఉంటారు. వీరికి సండే వచ్చిందంటే చాలు కచ్చితంగా చేపలు ఉండాల్సిందే.. అందుకోసం స్పెషల్‌గా మార్కెట్‌కు వెళ్లి మరీ ఇష్టం వచ్చిన చేపలను తెచ్చుకుంటారు. అయితే కొందరు పచ్చి చేపల పులుసు ఇష్టపడితే మరి కొంత మంది ఎండు చేపలను ఇష్టపడుతారు. అలాంటి వారికి ఎండు చేపల పచ్చడి ఫర్‌ఫెక్ట్ అని చెప్పాలి. తీరప్రాంత రుచులను ఇష్టపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ పచ్చడిని సరైన పద్ధతిలో తయారు చేస్తే ఫ్రిజ్‌లో కొన్ని రోజుల వరకు తాజాగా నిల్వ ఉంచుకోవచ్చు. మరీ దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి.

1 / 5
మొదటగా మార్కెట్‌కు వెళ్లి మంచిగా ఎండిన చేపలను తీసుకురండి.  ఇంటకొచ్చాక వాటిలోని వ్యర్థాలను పూర్తిగా తొలగించి. చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేయండి.. ఇప్పుడు కత్తిరించిన చేప ముక్కలను నీటిలో వేసి బాగా కడగాలి. ముక్కలు తెల్లగా మారే వరకు, నీచు వాసన పూర్తిగా పోయేంత వరకు కడగాలి.  తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని, ఒకదానిపై ఒకటి లేకుండా పేర్చాలి. వీటిని ఎండలో లేదా కిటికీలో కొద్దిసేపు ఆరబెట్టాలి. ముక్కలలోని తేమ పూర్తిగా పోవడం వల్ల అవి బాగా వేగుతాయి.

2 / 5
ఇప్పుడు ఒక బాణలిని స్టవ్‌పై పెట్టి ఆలివ్ ఆయిల్ లేదా సాధారణ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, ఎండు చేప ముక్కలను సిమ్‌లో పెట్టి నెమ్మదిగా వేయించాలి. ముక్కలు ఎర్రగా, కరకరలాడే విధంగా వేగాలి. చేపలలో సహజంగా ఉప్పు శాతం అధికంగా ఉంటుంది కాబట్టి, వేయించేటప్పుడు లేదా మసాలా కలిపేటప్పుడు ఉప్పును చాలా తక్కువగా వాడాలి. కేవలం మసాలాకు సరిపడా ఉప్పు మాత్రమే వేయాలి. సరిగ్గా వేగిన చేప ముక్కలు ఎటువంటి వాసన లేకుండా ఉంటాయి.

3 / 5
చేప ముక్కలు వేయించిన తర్వాత, అదే బాణలిలో కొద్దిగా నూనె ఉంచి, పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి చిటపటలాడే వరకు వేగించాలి. ఇవి వేగిన తర్వాత, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి.

4 / 5
పోపు వేగిన తర్వాత, కొద్దిగా పసుపు, సరిపడా కారం (రెండు నుండి రెండున్నర స్పూన్లు), ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి తయారు చేసుకున్న మసాలా పొడిని చేర్చాలి. ఈ మసాలాను బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను ఈ మసాలా మిశ్రమంలో వేసి, మసాలా ముక్కలకు బాగా పట్టేలా కలపాలి.

5 / 5
ఈ విధంగా తయారు చేసిన ఎండు చేపల నిలువ వేపుడును ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం ద్వారా కొన్ని రోజుల వరకు తాజాగా ఉంచుకోవచ్చు. ఇది వేడి అన్నం, దోసె, ఇడ్లీ, చపాతీ వంటి వాటితో బాగా సరిపోతుంది. ముఖ్యంగా, పప్పు మరియు అన్నంతో కలిపి తింటే దీని రుచి మరింత మెరుగుపడుతుంది. సరైన పద్ధతిలో తయారుచేస్తే ఈ పచ్చడి సుదీర్ఘ కాలం పాటు దాని రుచిని, నాణ్యతను కోల్పోదు.

Loading...
Unable to load recommendations.
Follow Us