
ముజఫ్ఫర్ స్వీట్ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : గోల్డ్ కలర్ సేమియా 250 గ్రాములు, చక్కెర 300 గ్రాములు,నెయ్యి 70 గ్రాములు, నిమ్మకాయ ఒకటి, పాలు, కేవ్రా నీళ్లు, జీడి పప్పు, బాదం, కుంకుమ పువ్వు, యాలకులు రెండు.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా గోల్డ్ కలర్‌లో ఉన్న సేమియాను తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి, సేమియా మాడకుండా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్వీట్ తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని, అందులో పాలు పోసి, చక్కెర కూడా వేయండి. తర్వాత రెండు చుక్కల నిమ్మరసం వేయండి. దీని వలన ఈ ద్రావణం గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు దాదాపు సన్నని మంటపై ఈ చక్కెర, పాల ద్రావణం నురగ వచ్చే వరకు మరగనివ్వండి. తర్వాత నురగ తీసి వేసి, దీనిని నుంచి నీటిని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరొక పాత్రను తీసుకొని అందులో నీరు పోసి, వాటిని మరగ బెట్టండి. మరిగిన నీళ్లలో పాలల్లో నానబెట్టి తీసుకున్న కుంకుమ పువ్వు వేసి, కలపండి. ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో గట్టిగా చుట్టి నీటిలో రెండు మూడు సార్లు ముంచి తీయండి. దీని వలన సేమియా కాస్త డిఫరెంట్‌గా ఉడికినట్లుగా కనిపిస్తుంది. తర్వాత దీనిని ఒక పాత్రలోకి తీసుకొని, అందులో కరిగిన నెయ్యి వేసి మంచిగా కలుపుకోండి. అప్పుడు సేమియా దేనికి అదే విడిపోయి ఉంటుంది.

ఇప్పుడు మనం ముదుగా కలిపి పెట్టుకున్న చక్కెర నీటి ద్రావనం తీసుకొని అందులో, కేవ్రా నీళ్లు కొంచెం వేసి, అందులో సేమియా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, అల్యూమీనియం ఫాయిల్‌తోపూర్తిగా కప్పి కనీసం 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోండి. తర్వాత బాదం, జీడిపప్పులతో గార్నిష్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ ముజఫ్ఫర్ స్వీట్ రెడీ.