
కోవా తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలు: 1 లీటరు, పంచదార, అర కప్పు కంటే తక్కువ (రుచికి సరిపడా), మిల్క్ పౌడర్,పావు కప్పు, యాలకుల పొడి, పావు టీ స్పూన్

తయారుచేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టాలి. అందులో అర లీటర్ పాలు పోసి, మంచిగా వేడి చేయాలి. కాస్త పసుపు రంగులోకి వస్తే పాలు బాగా మరిగినట్లు. అలా పాలను బాగా మరిగిస్తు, సగం పరిమాణం తగ్గే వరకు కలుపుతూ మరిగించుకోవాలి. ఎందుకంటే? పాలు ఎంత మరిగితే అంత బాగా కోవా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది.

పాలు మరిగి, పరిమాణం తగ్గిన తర్వాత, పంచదార వేసి, మిక్సీ చేసుకోవాలి. దీంతో కోవా చక్కెర కలిసి, మిశ్రమం కొంచెం చిక్కగా మారుతుంది. ఇలానే పది నిమిషాల పాటు, హై ఫ్లేమ్‌లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. దీంతో కోవా లా వస్తుంది. దీని తర్వాత మిల్క్ పౌడర్ వేసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీని వలన కోవా మంచి ప్లేవర్ వస్తుంది. అలాగే చాలా రుచిగా ఉంటుంది దీని తర్వాత యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే, కోవా చల్లబడి, గట్టి పడుతుంది.

కోవా, బన్ : కోవా బన్ తయారు చేయడానికి ఇప్పుడు చిన్న చిన్న బన్స్ తీసుకోవాలి. ఇవి షాప్‌ల్లో కొనుగోలు చేయాలి. వీటిని సగానికి కట్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న కోవాను మధ్యలో పెట్టి, బన్‌ను సున్నితంగా నొక్కాలి. దీంతో కోవా బన్ తయారీ రెడీ.

ఈ కోవాతో దాదాపు ఎనిమిది వరకు కోవా బన్ తయారు చేసుకోవచ్చు. సాయంత్ర స్నాక్స్‌గా పిల్లలకు ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. అంతే కాకుండా స్కూల్‌కు బాక్స్‌లో పెట్టించినా, వారు స్నాక్స్ టైమ్ లో తినడానికి వీలుగా ఉంటుంది. మరి మీరు కూడా మీ ఇంటిలో ప్రిపేర్ చేయండి.