చుండ్రు, దురద సమస్యలకు చెక్.. ఇంట్లోనే వేపాకులతో హెర్బల్ షాంపూ తయారు చేసుకోండిలా!

Updated on: May 04, 2026 | 1:17 PM

కలుషిత వాతావరణం, ఒత్తిడి వల్ల ప్రస్తుతం చాలామంది జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు వాడినా ఆశించిన ఫలితం ఉండదు. అటువంటప్పుడు మన పూర్వీకులు అనుసరించిన వేప చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. వేపాకులతో ఇంట్లోనే హెర్బల్ షాంపూను ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రయోజనాల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్దాం..

1 / 5
ముఖ్యంగా వేసవి కాలంలో వేడి, చెమట కారణంగా తలలో చుండ్రు, దురద సమస్య తీవ్రంగా మారుతుంది. దీని నివారించేందుకు ప్రజలు తరచుగా రకరకాల రసాయన షాంపూలను ఉపయోగిస్తుంటారు, కానీ ఇవి దీర్ఘకాలంలో హానికరం కావచ్చు. మీరు సులభమైన, సహజమైన పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే, వేప షాంపూ ఒక గొప్ప ఎంపిక అవుతుంది. వేపలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు తల చర్మాన్ని శుభ్రపరిచి, ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తాయి. అదృష్టవశాత్తూ, దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

2 / 5
జుట్టు సమస్యలకు వేప ఒక శక్తివంతమైన ఔషధం. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన షాంపూలకు బదులుగా, ఇంట్లోనే వేపాకులతో సహజమైన హెర్బల్ షాంపూను తయారు చేసుకోవచ్చు. ఇది చుండ్రును అరికట్టడమే కాకుండా, తలలో దురద, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఈ వేప షాంపూ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూద్దాం...

3 / 5
కావాల్సినవి రెండు కప్పుల తాజా వేపాకులు. కొన్ని కుంకుడుకాయలు (Reetha) లేదా సీకాకాయ పొడి. ఒక టీస్పూన్ కలబంద (Aloe Vera) జెల్. తగినన్నీ నీళ్లు తీసుకోవాలి. ముందుగా వేపాకులను శుభ్రంగా కడిగి, తగినన్ని నీరు పోసి బాగా మరిగించాలి. నీరు సగం అయ్యే వరకు మరిగిస్తే వేపలోని రసం పూర్తిగా నీటిలోకి చేరుతుంది.

4 / 5
మరోపక్క కుంకుడుకాయలను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు వాటిని మరిగించి రసం తీసుకోవాలి. ఇప్పుడు వేప నీటిని, కుంకుడుకాయ రసాన్ని కలిపి చల్లార్చాలి. చివరగా ఇందులో కొద్దిగా కలబంద జెల్ కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. సాధారణ షాంపూ లాగే దీనిని తలకు పట్టించి, వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

5 / 5
కలిగే ప్రయోజనాలు: వేపలోని యాంటీ ఫంగల్ గుణాలు మొండి చుండ్రును కూడా వారం రోజుల్లోనే తగ్గిస్తాయి. తలలో వచ్చే కురుపులు, అలర్జీ, దురదను ఇది తక్షణమే తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లను శుభ్రపరిచి, రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ షాంపూ వాడటం వల్ల తలలో పేల సమస్య కూడా తగ్గుతుంది. ప్రకృతి ప్రసాదించిన వేపతో తక్కువ ఖర్చుతో మీ జుట్టును మెరిసేలా మార్చుకోండి.

Follow Us