
ఇంటికి అనుకోకకుండా ఎక్కువ బంధువులు వచ్చినప్పుడు తక్కువ చికెన్ తెచ్చినా కూర కనీసం ఐదు మందికి రావాలంటే ఈ సారి మీరు చికెన్ వండేటప్పుడు ఇవి కూర మధ్యలో వేస్తె చాలు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఆ నేచురల్ టిప్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఉల్లిపాయలను ఎక్కువగా కూరలో వేయాలి: మీరు అరకిలో చికెన్ తెచ్చినా ఈ ఉల్లిపాయలను దానిలో వేస్తే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. కూర కారంగా ఉన్నా కూడా దీని వలన స్పైసీ తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయల వలన గ్రేవీ కూడా పెరుగుతుంది. అప్పుడు అర కేజీ కూర కూడా కేజీలా కనిపిస్తుంది.

టమాటాలు కూరలో వేసి మగ్గించాలి: అరకిలో చికెన్ లో మీరు 200 గ్రాములు టమాటాల ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి. ఈ టమాటాలు గ్రేవీని పెంచడమే కాకుండా కూరకు సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా మంచి కలర్ కూడా వస్తుంది. దీంతో ఇది ఎక్కువ కూర ఉన్నట్లు ఇది కనిపిస్తుంది.

కొబ్బరి పేస్ట్‌ను ఈ కూరలో వేయండి: చికెన్ ఉడికేటప్పుడు కొబ్బరి పేస్ట్ లేదా కొబ్బరి పాలు వేస్తే కూరకు అదిరిపోయే టేస్ట్ వస్తుంది. అంతేకాదు, గ్రేవీని కూడా పెంచుతుంది. అయితే, కూర మధ్యలో ఇది వేస్తే కూర ఎక్కువయ్యేలా చేస్తుంది. మీరు అర కేజీ తెచ్చినా కేజీ కూర చేసేయచ్చు. చికెన్ గిన్నె కూడా ఫుల్‌గా అవుతుంది

కూర మధ్యలో బంగాళాదుంప వేయాలి: చికెన్ ఉడికేటప్పుడు రెండు బంగాళాదుంప కూర ఎక్కువగా అవుతుంది. అయితే , బాగా ఉడికిన తర్వాత వీటిని వేస్తే గ్రేవీగా మారుతుంది. దీని వలన కూర గట్టిగా, ఎక్కువగా అవుతుంది. అంతేకాదు, పోషకాలు కూడా ఉంటాయి. మీరు కూర వేసేటప్పుడు ఈ సారి ఇవి వేయండి.