
ముందుగా పది ఇవి నేల మీద పండుతాయి కాబట్టి, నేల ములక్కాయలు అని పిలుస్తారు. వీటితో కూర చేసి తింటే రుచి అదిరిపోతోంది. ధనియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసి తింటే ఇంకా రుచిగా ఉంటుంది.

వాటిని తీసుకుని కట్ చేసి, ముల్లు మొత్తం తీసేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు , ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి.

ఇక ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసిన ములక్కాడ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసి ములక్కాడలు మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

ఇక చివర్లో గరం మసాలా పొడి, ఆయిల్ పైకి తేలే వరకు దాని మీదే ఉంచి, కొత్తిమీరను చల్లుకుని దించేయాలి. అంతే నేల ములక్కాయ రెడీ.