
కావాల్సిన పదార్ధాలు : అర కిలో కాకరకాయలు, పెద్ద ఉల్లిపాయ 2, 100 గ్రాముల ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 50 గ్రాములు కరివేపాకు ఆకులు, ఆవాలు, నూనె, ఉప్పు, కారం, పసుపు తీసుకోవాలి.

ముందుగా కాకరకాయలను తీసుకుని వాటిని నీటితో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని నూనెలో వేయించి పెట్టుకోవాలి

ఇప్పుడు రొటీని తీసుకుని దానిలో వేయించిన ఎండుమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి దంచుకోవాలి.

ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలను నూరిన దానిలో వేసి గరిటేతో మిక్స్ అయ్యేలా తిప్పుకుని 15 నిముషాల పాటు స్టవ్ మీదే వేయించండి.

ఇక దించే ముందు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి కొత్తిమీర ఆకులు కూడా వేసి వేడి వేడి అన్నంలో తింటే చికెన్, మటన్ కూడా సరిపోవు. దీనిలో వేసే వెల్లుల్లి బరువు సులభంగా తగ్గిపోతారు.