Health Tips: 50టీస్‌లోనూ 20టీస్‌లా ఫిట్‌గా కనిపించాలా?.. రోజూ ఈ ఐదు పనులు చేస్తే చాలు..

Updated on: Oct 19, 2026 | 9:00 PM

వయసు పెరగడం అనేది సహజమైన ప్రక్రియ. దాన్ని ఎవరూ ఆపలేరు. అయితే 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఎంతో యవ్వనంగా, ఫిట్‌గా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. దీని కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల 50 ఏళ్ల తర్వాత కూడా ఎనర్జిటిక్‌గా, యవ్వనంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరీ ఆ మార్పులేంటో ఇక్కడ చూద్దాం.

1 / 5
యోగా: ఎల్లప్పుడూ ఫిట్‌గా, ఉత్సాహంగా ఉండాలనుకునేవారు రోజూ యోగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యోగా కేవలం శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడమే కాకుండా, శరీరాన్ని తేలికగా, రోజంతా శక్తివంతంగా ఉంచుతుందని సూచిస్తున్నారు. ఇది గొప్ప మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం, రోజూ యోగా చేయడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా ముఖంపై ముడతలు, అలసట తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది.

2 / 5
వ్యాయామం: యోగాతో పాటు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవడం లేదా సాధారణ వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో మెటబాలిజంను వేగవంతం చేసి, ఒత్తిడిని దూరం చేస్తుంది. అంతేకాకుండా, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో వ్యాయామం ప్రముఖ పాత్ర పోషిస్తుందంటున్నారు. రోజూ నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చర్మానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. దీంతో చర్మ సహజ కాంతి పెరుగుతుంది. ఎముకలు, కండరాలు సైతం బలంగా మారి, వయసు పైబడినా శరీరం దృఢంగా ఉంటుంది.

3 / 5
సరైన నిద్ర: శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడానికి మంచి నిద్ర చాలా అవసరం. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ రాత్రి పూట 7 నుంచి 8 గంటల పాటు నిరంతరాయంగా, గాఢంగా నిద్రపోవాలి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, తేలికపాటి మాయిశ్చరైజర్‌ను రాసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.

4 / 5
పోషకాహారం: రోజువారీ ఆహారంలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. నారింజ, నిమ్మకాయ, ఉసిరి, బొప్పాయి, బ్రోకలీ, పాలకూర వంటి ఆహారాలతో పాటు డ్రై ఫ్రూట్స్, సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి, చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇవి చర్మంపై వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి.

5 / 5
చెడు అలవాట్లకు చెక్: ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ వంటి దురలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం వంటి అలవాట్లు గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా, వృద్ధాప్య ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. వీటిని మానేయడం ద్వారా 50 ఏళ్ల తర్వాత కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, యవ్వన కాంతితో మెరిసిపోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us