కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో ఆరోగ్యం సేఫ్

Updated on: Apr 21, 2026 | 8:46 PM

మనం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మి పంచదారకు బదులు బెల్లాన్ని వాడుతుంటాం. కానీ, ఇప్పుడు ఆ తీపి పదార్థమే మన ప్రాణాల మీదకు వస్తోంది. ఆకర్షణీయంగా కనిపించే పసుపు రంగు బెల్లం వెనుక ప్రమాదకరమైన రసాయనాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా..? మీరు తింటున్నది స్వచ్ఛమైన బెల్లమేనా లేక తీపి విషమా? కల్తీ బెల్లాన్ని ఇంట్లోనే చిటికెలో ఇలా కనిపెట్టేయండి..

1 / 5
మన దేశంలో బెల్లం లేకుండా ఏ వంటిల్లు ఉండదు. పంచదారకు ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనం బెల్లాన్ని నమ్ముతాం. కానీ మీరు కొనే ఆ బెల్లం ఎంతవరకు స్వచ్ఛమైనది..? మార్కెట్లో దొరికే రంగుల వెనుక ప్రమాదకరమైన సుద్దపొడి, వాషింగ్ సోడా వంటి రసాయనాలు దాగి ఉండవచ్చు. ఈ కల్తీ బెల్లం వాడకం వల్ల దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
 మీరు వాడుతున్న బెల్లం స్వచ్ఛమైనదో కాదో ఇంట్లోనే కొన్ని చిన్న పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక గ్లాసు నిండా నీటిని తీసుకోండి. అందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేయండి. స్వచ్ఛమైన బెల్లం నెమ్మదిగా కరిగి అడుగుకు చేరుతుంది. ఒకవేళ అది కల్తీదైతే, నీటి పైభాగంలో తెల్లటి మచ్చలు లేదా అవశేషాలు తేలుతాయి. అలాగే అడుగున ఇసుక లేదా సుద్దపొడి లాంటి పదార్థం మిగిలిపోతుంది.

3 / 5
నిమ్మరసం పరీక్ష: బెల్లం ముక్కపై కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ వేయండి. ఒకవేళ బుడగలు వస్తే అందులో వాషింగ్ సోడా కలిపినట్లు అర్థం. స్వచ్ఛమైన బెల్లం అస్సలు బుడగలు రావు. అంతేకాకుండా సాధారణంగా ముదురు గోధుమ రంగులో ఉండి తాకితే గరుకుగా ఉండేది అసలైన బెల్లం. మార్కెట్లో ఆకర్షణీయంగా కనిపించే లేత పసుపు రంగు బెల్లంలో రసాయనాలు కలిసే అవకాశం ఎక్కువ.

4 / 5
బెల్లంతో లాభాలు: భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఎంజైమ్‌లు ఉత్తేజితమై జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇందులో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఎనీమియాను తగ్గిస్తుంది. జింక్, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. కాలుష్యం వల్ల వచ్చే ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించడంలో బెల్లం కీలకంగా పనిచేస్తుంది.

5 / 5
ఏదైనా అతిగా తింటే ప్రమాదమే. బెల్లంలో సుక్రోజ్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దీనిని మితంగా తీసుకోవాలి. కొంతమందిలో బెల్లం వల్ల కడుపు నొప్పి, చర్మంపై దద్దుర్లు లేదా దగ్గు వంటి అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.

Follow Us