మీ ఇంట్లో ఎలుకల గోల ఎక్కువైందా? ఈ 5 హోమ్ రెమెడీస్‌తో వాటికి శాశ్వతంగా చెక్ పెట్టండి!

Updated on: Apr 06, 2026 | 9:35 AM

ఇంట్లో ఎలుకలు దూరితే బట్టలు, పుస్తకాలు, విలువైన వస్తువులను కొరికేసి పాడు చేస్తాయి. మార్కెట్లో దొరికే ఎలుకల మందులు పిల్లలకు లేదా పెంపుడు జంతువులకు ప్రమాదకరం కావచ్చు. ఎలుకలు ఇంట్లోని వస్తువులను పాడు చేయడమే కాకుండా భయంకరమైన వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. అందుకే, ఎటువంటి హానికరమైన రసాయనాలు లేదా విషం వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతుల్లో ఎలా వదిలించుకోవాలో తెలుసుకుంటే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు.. అలాంటి సింపుల్‌ టిప్స్‌ ఇప్పుడు చూద్దాం..

1 / 6
పిప్పరమెంటు నూనె (Peppermint Oil): ఎలుకలకు పిప్పరమెంటు వాసన అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొన్ని దూది ఉండలను తీసుకుని వాటిపై పిప్పరమెంటు నూనె వేసి, ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో లేదా రంధ్రాల వద్ద ఉంచండి. ఆ ఘాటైన వాసనకు అవి మీ దరిదాపుల్లోకి కూడా రావు.

2 / 6
మిరియాల పొడి (Black Pepper): ఎలుకల ముక్కు చాలా సున్నితంగా ఉంటుంది. మిరియాల పొడిని ఎలుకలు వచ్చే దారుల్లో చల్లడం వల్ల వాటి శ్వాసకు ఇబ్బంది కలిగి వెంటనే అక్కడి నుండి పారిపోతాయి. ఇది చాలా ప్రభావవంతమైన, చౌకైన పద్ధతి.

3 / 6
ఉల్లిపాయలు, వెల్లుల్లి: ఉల్లిపాయలు లేదా వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కోసి ఎలుకలు వచ్చే రంధ్రాల వద్ద ఉంచండి. వీటి నుండి వచ్చే ఘాటైన వాసన ఎలుకలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఉల్లిపాయలు త్వరగా కుళ్లిపోతాయి కాబట్టి ప్రతి రెండు రోజులకు ఒకసారి మార్చుతూ ఉండాలి.

4 / 6
బేకింగ్ సోడా ట్రిక్: సమాన పాళ్లలో బేకింగ్ సోడా, పంచదారను కలపండి. పంచదార తీపికి ఆకర్షితులై ఎలుకలు దీనిని తింటాయి. బేకింగ్ సోడా వాటి కడుపులోకి వెళ్ళినప్పుడు గ్యాస్ ఉత్పత్తి అయ్యి అవి ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతాయి.

5 / 6
బిర్యానీ ఆకులు: మనం వంటల్లో వాడే బిర్యానీ ఆకుల వాసన కూడా ఎలుకలకు పడదు. వీటిని చిన్న ముక్కలుగా చేసి మూలల్లో చల్లడం వల్ల ఎలుకల రాకను అడ్డుకోవచ్చు. ఇంట్లో వాడే బేకింగ్ సోడాను పంచదారతో కలిపి ఎలుకలు వచ్చే చోట ఉంచితే, దానిని తిన్న తర్వాత ఎలుకలు ఇల్లు వదిలి వెళ్లిపోతాయి.

6 / 6
చిట్కాలతో పాటు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎలుకలకు ఆహారం దొరకకుండా డబ్బాలను గట్టిగా మూసి ఉంచండి. ఈ చిన్న జాగ్రత్తలతో మీ ఇంటిని ఎలుకల రహితంగా మార్చుకోవచ్చు.

Follow Us