
పుదీనా: పుదీనాను అందరూ కూరల్లో వాడుతారు. కానీ ఈ మొక్క బొద్దింకలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని చాలా మందికి తెలియదు. అవును పుదీనా మొక్క నుండి వచ్చే మంచి సువాసన మనకు నచ్చినప్పటికీ, బొద్దింకలకు మాత్రం ఇది అస్సలు పడదు. పుదీనా ఆకుల్లో ఉండే సుగంధ గుణాలు బొద్దింకలను ఇళ్ల దరిచేరకుండా చేస్తాయి. దీనిని వంటగదిలో లేదా కిటికీల దగ్గర పెంచడం వల్ల బొద్దింకల బెడద తప్పుతుంది.

లెమన్ గ్రాస్ : నిమ్మగడ్డిలో 'సిట్రోనెల్లా' అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది దోమలు, బొద్దింకలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచడంలో ఈ సువాసన అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక మంచి సహజ కీటకనాశినిగా ఉపయోగపడుతుంది. అయితే పిల్లులకు ఎంతో ఇష్టమైన క్యట్‌నిస్ మొక్క కూడా బొద్దింకలను తరిమేస్తుంది. ఈ మొక్కలో 'నెపెటాలాక్టోన్ అనే రసాయన ఘటకం ఉంటుంది. మార్కెట్లో దొరికే రసాయనాల కంటే బొద్దింకలను, కీటకాలను తరిమికొట్టడంలో క్యాట్‌నిప్ మొక్క పది రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

లావెండర్: చూడ్డాన్ని క్యూట్‌గా కనిపించే లావెండర్ ఇళ్లకు అందాన్ని ఇవ్వడమే కాకుండా కీటకాలను కూడా దూరం చేయండంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని వాసన బొద్దింకలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. బెడ్‌రూమ్‌లలో లేదా లివింగ్ రూమ్‌లలో దీనిని ఉంచడం ద్వారా బొద్దింకల సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.

రోజ్‌మేరీ: బొందికలను తరిమికొట్టే మొక్కలలో రోజ్‌మెరీ కూడా ఒకటి. దీని ఆకుల నుండి వచ్చే ఘాటైన వాసన బొద్దింకలను ఇంటి నుండి దూరంగా ఉంచుతుంది. అలాగే చాలా మంది ఇళ్లలో ఉండే చామంతి మొక్క కూడా బొద్దింకలను తరిమి కొడుతుంది. చామంతి పువ్వులలో పైరెత్రిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. మార్కెట్లో దొరికే చాలా పురుగుల మందులలో ఈ పదార్థాన్ని వాడుతుంటారు. బొద్దింకలు, చీమలు,, ఇతర కీటకాలు ఈ మొక్క ఉన్న పరిసరాల్లోకి రావడానికి అస్సలు ఇష్టపడవు.

బిరియానీ ఆకు : బొద్దింకలను తరిమికొట్టడంలో దీనిని మించిన పవర్ ఫుల్ వెపన్ మరోటి లేదనే చెప్పాలి. మనం వంటల్లో సువాసన కోసం వాడే బిరియానీ ఆకు వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. ఈ మొక్కను వంటగదిలో పెంచడం లేదా ఎండిన బిరియానీ ఆకులను పొడి చేసి బొద్దింకలు తిరిగే మూలల్లో చల్లడం ద్వారా వాటిని పూర్తిగా వదిలించుకోవచ్చు. ఈ చిట్కాల ద్వారా మీరు ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజంగా బొద్దింకల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చు.