Cockroach: జస్ట్ రూ.10లతో మీ ఇంట్లో బొద్దింకలను రాత్రికి రాత్రే తరిమి కొట్టండి.. ఏం చేయాలంటే?

Updated on: Mar 26, 2026 | 11:48 AM

బొద్దింకలు వంటగదిలో అత్యంత చికాకు కలిగించే కీటకాలు. ఇవి ముఖ్యంగా వంటగదులు, బాత్రూంలు, తడి ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి అనేక వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. అయితే వీటి నివారణకు కొంతమంది మార్కెట్లో దొరికే రసాయన స్ప్రేలు లేదా పౌడర్లను ఉపయోగించి బొద్దింకలను చంపుతారు. కానీ ఇలా చేయడం పిల్లలకు, పెంపుడు జంతువులకు ప్రమాదకరం.

1 / 5

2 / 5
ఇంట్లోనే సహజ పదార్ధాలతో వీటిని సులువుగా నివారించవచ్చు. అందుకు ముందుగా 1-2 అరటిపండు తొక్కలు, చిన్న పాత్ర, 1-2 టీస్పూన్ల డిటర్జెంట్ (ద్రవ లేదా పొడి), 1-2 టీస్పూన్ల చక్కెర, అర కప్పు నీరు (సుమారు 100-120 మి.లీ) తీసుకోవాలి.

3 / 5
అరటిపండు తొక్కను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకుని 1 నుంచి 2 టీస్పూన్ల చక్కెర వేసుకోవాలి. అనంతరం 1-2 టీస్పూన్ల డిటర్జెంట్ కలుపుకోవాలి. ఇందులో అర కప్పు నీళ్లు పోసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా కాకుండా కాస్త పల్చగా ఉండాలి.

4 / 5
మిశ్రమం ఉన్న గిన్నెను బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశంలో ఉంచాలి. వంటగది సింక్ కింద, అల్మరా మూలలో, ఫ్రిజ్ వెనుక, చెత్తబుట్ట దగ్గర, బాత్రూంలోఉంచవచ్చు. ఇందులోని పంచదార, అరటిపండు తొక్కల తీపి వాసన బొద్దింకలను ఆకర్షిస్తుంది. అవి ఈ మిశ్రమం వద్దకు వచ్చి అందులో పడిపోయి దానిని తాగుతాయి. ఇందులోని డిటర్జెంట్ వాటి శ్వాస మార్గాలను అడ్డుకుంటుంది. ఫలితంగా అవి త్వరగా చనిపోతాయి.

5 / 5
అయితే ఈ గిన్నెను పిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. అరటిపండు తొక్క దాని వాసనను కోల్పోయి, డిటర్జెంట్ ప్రభావాన్ని తగ్గిస్తుంది కాబట్టి ప్రతి ఒకటి లేదా రెండు రోజులకు ఈ మిశ్రమాన్ని మార్చి, కొత్తదాన్ని తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఆహారం, నీటి పాత్రలను మూసి ఉంచడం, తడి ప్రదేశాలను పొడిగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. ఇలా చేస్తే బొద్దింకలు తిరిగి రాకుండా నివారించవచ్చు.

Follow Us