
బియ్యప్పిండి, నీరు: మీ ఇంట్లో ఉన్న దోసల పిండి పులిసిపోతే అందులో 2 నుండి 4 టేబుల్ స్పూన్ల వేయించిన లేదా పచ్చి బియ్యప్పిండిని కలిపి తగినన్ని వేయండి. తర్వాత దాన్ని బాగా కలపండి. ఇలా చేయడం వల్ల పిండిలోని ఎక్కువగా ఉన్న పులుపు తగ్గడమే కాకుండా, పిండికి కావలసిన చిక్కదనం కూడా వస్తుంది. ఆ పిండితో మీరు మళ్లీ దోసలు చేసుకోవచ్చు.

బొంబాయి రవ్వ: మీరు రెడీ చేసుకున్న పిండి మరీ ఎక్వగా పులిసిపోతే.. అందులో కొద్దిగా బొంబాయి రవ్వను కలపవచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు బొంబాయి రవ్వను నానబెట్టి, ఆ తర్వాత పిండిలో కలిపి బాగా మిక్స్ చేయండి. లేదా కొద్దిగా పచ్చిబియ్యాన్ని నానబెట్టి మెత్తగా రుబ్బి పులిసిన పిండితో కలపండి. ఇలా చేయడం వల్ల పులుపు తగ్గడంతో పాటు ఇడ్లీలు చాలా మృదువుగా, దోశలు కరకరలాడుతూ వస్తాయి.

చిటికెడు చక్కెర: పుల్లగా మారిన పిండిని వెంటనే సాధారణ స్థితికి తీసుకురావడంతో చక్కెర చాలా ప్రభావితంగా పనిచేస్తోంది. ఇందుకోం ఇడ్లీ లేదా దోశ వేసే ముందు పిండిలో అర టీస్పూన్ చక్కెర వేసి బాగా కలపండి. ఇది పిండిలోని పులుపును తగ్గించడమే కాకుండా, దోశలు వేసేటప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేలా చేస్తుంది. అయితే చక్కెర మరీ ఎక్కువగా వేయకండి లేదంటి పిండి తీపిగా మారుతుంది.

సాధారణంగా పిండి పులిసినప్పుడు అందులోని నీరు పైకి తేలుతుంది. కాబట్టి పిండిని కలపడానికి ముందే పైన తేలిన నీటిని తీసేయండి.ఇలా చేయడం ద్వారా కూడా పులుపు తగ్గుతుంది. ఎందుకంటే పిండిలోని పులుపు మొత్తం ఆ నీటిలో ఉంటుంది. ఆ తర్వాత దానికి బదులుగా కొద్దిగా మంచినీళ్లు పోసి పిండిని కలపండి. తర్వాత ఆ పిండిని మీరు మళ్లీ వాడుకోవచ్చు.

కొబ్బరిపాలు: పులిసిన పిండిని మళ్లీ సాధారనంగా మార్చేందుకు అందులో పాలు లేదా కొబ్బరిపాలు కలుపొచ్చు. వీటిని కలపడం వల్ల పిండి రుచి పెరగడమే కాకుండా పులుపు కూడా తగ్గుతుంది. ఇందుకోసం పిండిలో పావు కప్పు చిక్కటి కొబ్బరిపాలు లేదా మామూలు పాలు పోసి బాగా కలపండి. తర్వాత ఆ పండిని ఇడ్లీ లేదా దోసకోసం వాడుకోండి.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ లేదా నివేదికగా ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.