కుస్తీలు పడే పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా ఇత్తడి వస్తువులను కొత్తవాటిలా మార్చండి

Updated on: Nov 13, 2026 | 3:30 PM

చాలా మంది ఇళ్లలో ఇత్తడి వస్తువులను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా బకెట్లు, పాత్రలు వంటి ఇత్తడి వస్తువులు ఎక్కువ కాలం వాడటం వల్ల వాటి సహజమైన మెరుపును కోల్పోయి నల్లగా మారుతుంటాయి. ఇలాంటి వాటిని సాధారణ నీటితో శుభ్రం చేసినా మరకలు తొలగిపోవు. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సరైన పద్ధతిలో శుభ్రం చేస్తే.. పాతబడిపోయిన ఇత్తడి వస్తువులను సైతం కొద్ది నిమిషాల్లోనే కొత్తవాటిలా మెరిసేలా చేయవచ్చు. మరి మీ ఇంట్లోని పాత ఇత్తడి బకెట్లను మళ్లీ తళతళలాడేలా ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ప్రతి ఇంట్లో ఇత్తడి వస్తువులను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా దేవుడి గదిలో దీపాలు పెట్టేందుకు, చికెన్‌లో నీటిని నింపేందుకు ఇలా రకరకాల అవసరాల కోసం ఇత్తడి బకెట్‌లు, పాత్రలు వంటివి వాడుతారు.అయితే ఎక్కవ రోజులు వాడడం వల్ల, గాలి, తేమ కారణంగా, ఇత్తడి రంగు మారి, మరకలు పడతాయి. చాలా మంది వాటిని మెరిపించడానికి ఖరీదైన క్లీనర్‌లను కొనుగోలు చేస్తారు.

2 / 5
అయితే మీ ఇంట్లో  ఉండే నిమ్మకాయ, ఉప్పు, వెనిగర్, బేకింగ్ సోడా వంటి పదార్థాలను వాడి ఈజీగా పాతబడిన ఇత్తడి వస్తువులను కొత్తవాటిలా మార్చవచ్చు..  ఇందుకోసం ఒక పాత్రలో గోరువెచ్చని నీటిని నింపి, అందులో కొద్దిగా ద్రవ డిష్‌వాషింగ్ డిటర్జెంట్ కలపండి. తర్వాత ఒక మృదువైన గుడ్డతో లేదా మృదువైన టూత్‌బ్రష్‌తో బకెట్‌ను శుభ్రం చేయండి. ఆ తర్వాత, శుభ్రమైన నీటితో కడిగి, పొడి గుడ్డతో తుడవండి.

3 / 5
తర్వాత ఉన్న ఇత్తడి వస్తువులు కొత్తవాటిలా కనిపించేందుకు వెనిగర్, బేకింగ్ సోడాను వాడొచ్చు. ఇందుకోసం కొద్దిగా బేకింగ్ సోడాను తెల్ల వెనిగర్‌తో కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను ఒక మెత్తటి గుడ్డతో బకెట్‌పై మరక ఉన్న ప్రదేశంలో మెల్లగా రాయండి. కొన్ని నిమిషాల తర్వాత, శుభ్రమైన నీటితో కడిగి, మైక్రోఫైబర్ గుడ్డతో తుడిచి ఆ తర్వాత ఆరబెట్టండి. ఇలా చేస్తే ఈజీగా నల్ల మరకలను తొలగించవచ్చు.

4 / 5
ఇవే కాదు మీ ఇంట్లో వాడి పడేసే నిమ్మకాయతో కూడా మీరు ఇత్తడి వస్తువులపై ఉన్న మరకలను ఈజీగా తొలగించవచ్చు. అవును ఇత్తడి వస్తువులపై మురికిని తొలగించేందుకు సహాయ పడే అమ్లాలు నిమ్మకాయలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఒక నిమ్మకాయను సగానికి కోసి, దానిపై కొద్దిగా ఉప్పు వేయండి. తర్వాత దానిని బకెట్ ఉపరితలంపై మెల్లగా రుద్దండి. ఆ తర్వాత, నీటితో శుభ్రంగా కడిగి, వెంటనే ఆరబెట్టండి.

5 / 5
అయితే ఈ వస్తువులను వాడి ఇత్తడి శుభ్రం చేసేప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని క్లీన్ చేసేప్పుడు స్టీల్, లేదా వైర్ స్క్రబ్బర్‌ను అస్సలూ వాడరాదు. రుద్దేటప్పుడు చాలా తేలికగా రుద్దా.. లేదంటే బకెట్‌పై ఉన్న ఇత్తడి పూత చెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. మీ బకెట్‌కు  ప్రత్యేక పూత లేదా లక్క ఉంటే, ఆమ్ల ద్రావణాలను వాడవద్దు. అలాగే క్లీన్ చేసిన తర్వాత ఇత్తడి బకెట్‌ను పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. తడి ఉండే అవి మళ్లీ నల్ల మరకలు మారే చాన్స్ ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us