
నీళ్లలో తేలితే వేస్టే: గుడ్డు తాజాదనాన్ని చెక్ చేయడానికి వాటర్ టెస్ట్ మోస్ట్ పాపులర్ హ్యాక్. ఒక పెద్ద గ్లాసు లేదా గిన్నెలో నీళ్లు తీసుకోండి. అందులో గుడ్డును మెల్లగా వేయండి. ఒకవేళ గుడ్డు గ్లాసు అడుగున పక్కకు పడుకుంటే.. అది 100శాతం ఫ్రెష్ అని అర్థం. ఒకవేళ అడుగున నిటారుగా నిలబడితే.. అది కాస్త పాతబడింది, కానీ తినొచ్చు. అలా కాకుండా గుడ్డు నీటిపై తేలుతూ ఉంటే మాత్రం.. అది కంప్లీట్‌గా పాడైపోయినట్లే గుడ్డు పాతబడే కొద్దీ దాని లోపల గాలి చేరి లైట్ వెయిట్ అయిపోయి నీటిపై తేలుతుంది.

బ్యాడ్ స్మెల్ ఉంటే: గుడ్డు కండిషన్‌ను కచ్చితంగా కనిపెట్టడానికి దాన్ని పగలగొట్టి వాసన చూడటం బెస్ట్ ఐడియా. నార్మల్ ఫ్రెష్ ఎగ్‌కు ఎటువంటి స్పెషల్ లేదా ఘాటైన వాసన ఉండదు. కానీ ఒకవేళ అది పాడైపోతే మాత్రం పగలగొట్టగానే ఒక విధమైన తీవ్రమైన అసహ్యకరమైన కుళ్ళిన వాసన వస్తుంది. ఉడకబెట్టిన తర్వాత లేదా పచ్చిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి నీచు లేదా కుళ్లిన వాసన వస్తే దాన్ని అస్సలు తినకుండా డస్ట్‌బిన్‌లో పడేయడం సేఫ్.

షెల్ టచ్ చేస్తే తెలిసిపోతుంది: గుడ్డు పైపెంకుని జస్ట్ టచ్ చేసి, జాగ్రత్తగా చూసి కూడా అది ఫ్రెషా కాదా అని ఈజీగా చెప్పొచ్చు. వీటి పెంకు కాస్త రఫ్‌గా ఉంటుంది. గుడ్డు పాతబడే కొద్దీ దాని పెంకు చాలా స్మూత్‌గా , మెరుస్తూ మారుతుంది. పెంకు మీద ఏవైనా చిన్న చిన్న పగుళ్లు ఉన్నా, నల్లటి బూజు మచ్చలు కనిపించినా లేదా జిగటగా అనిపించినా అందులోకి బ్యాక్టీరియా చేరిందని అర్థం.

సౌండ్ టెస్ట్: ఇది మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్విక్ చెకింగ్ మెథడ్. గుడ్డును వేళ్లతో పట్టుకుని మీ చెవి దగ్గరకు తీసుకెళ్లి మెల్లగా ఊపి చూడండి. గుడ్డు లోపల నుండి ఎలాంటి సౌండ్ రాకుండా సైలెంట్‌గా ఉంటే.. అది పక్కా ఫ్రెష్ ఎగ్. అలా కాకుండా ఊపినప్పుడు లోపల ద్రవం అటు ఇటు కదులుతున్నట్లు దబదబా శబ్దం వస్తే.. ఆ గుడ్డు పాతబడిందని అర్థం. గుడ్డు పాతబడే కొద్దీ లోపలి సొన పల్చబడి, గాలి చేరడం వల్ల ఈ సౌండ్ వస్తుంది.

ప్లేట్ టెస్ట్ అండ్ హెల్త్ టిప్స్: గుడ్డును ఒక ప్లేట్‌లో పగలగొట్టినప్పుడు దాని పసుపు పచ్చ సొన గుండ్రంగా, ఎత్తుగా ఉండి.. తెల్లసొన చిక్కగా దాని చుట్టూ ఉంటే అది సూపర్ ఫ్రెష్. ఒకవేళ పసుపు సొన పగిలిపోయి, నీళ్లలా ప్లేట్ అంతా పరుచుకుంటే అది పాతబడిన గుడ్డు అని గుర్తుంచుకోండి. పాడైపోయిన గుడ్లను తింటే సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలు అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ సారి ఎగ్స్ వండే ముందు ఈ చిన్న చిన్న ట్రిక్స్ ట్రై చేయండి.