
ఒకటి మించిన బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏం జరుగుతుందని చాలా మంది మొదటల్లో ఒక ప్రశ్న ఉండిపోయింది. దీనికి సమాదానం మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఒక వ్యక్తి ఓ ప్రైమరీ అకౌంట్, ఒక సేవింగ్ అకౌంట్ ఉంచే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. అవసరం, ఆర్థిక కార్యకలాపాలను బట్టి మరో అకౌంట్ తీసుకోవచ్చు. కానీ మీకు ఎలాంటి అవరసం లేకుండా ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల ఎలాంటి లాభం లేదని నిపుణులు అంటున్నారు.

మీకు ఒకటి కంటే ఎక్కవ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీ డబ్బును అవసరానికి తగ్గట్టు డివైడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. ఓ అకౌంట్‌ను మీరు సాలరీ కోసం యూజ్ చేస్తూ.. మరో అకౌంట్‌ను ఇంటి ఖర్చులు, రోజువారి లావాదేవీలకు కోసం వాడొచ్చు. మరో అకౌంట్‌ను సేవింగ్స్ కోసం వాడొచ్చు.. ఇది ఇది ఖర్చులను, పొదుపును వేర్వేరుగా మెయింటేన్ చేసేందుకు సహాయపడడమే కాకుండా.. మీ ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది.. మీకు ఎంత ఆదాయం వస్తుందనేది తెలుసుకోవడం ఈజీ అవుతుంది.

మీ దగ్గర రెండు అకౌంట్స్ ఉంటే మీరు సెకండ్ అకౌంట్‌ను మొదటి దానికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అంటే మీ మొదటి అకౌంట్‌లో ఏవైనా సాంకేతిక సమస్య వస్తే.. మీకు ఆర్థిక ఇబ్బందుకు లేకుండా రెండో అకౌంట్‌ను తాత్కాలికంగా వాడుకోవచ్చు. ఈ పద్దతి ఫాలో అవ్వడం ద్వారా మన సేవింగ్స్ డబ్బును డైలీ ఖర్చుల నుంచి సేఫ్‌గా ఉంచొచ్చు.. అలాగే సేవింగ్స్ అనవసరంగా ఖర్చు చేయకుండా కాపాడుకోవచ్చు.

అయితే ఆర్థిక లావాదేవీలు ఎక్కువ చేసేవారు, వివిధ నగరాల్లో వ్యాపారాలు కలిగిన వ్యక్తులకు మూడో ఖాతా అవసరం అవుంతుంది. ఇలాంటి వ్యక్తులు ఓ అకౌంట్‌ను రోజూ ఖర్చుల కోసం, రెండో అకౌంట్‌ను సేవింగ్స్ కోసం, మూడో అకౌంట్‌లో అవసరమైన లావాదేవీల కోసం వాడుకోవచ్చు. అయితే, ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఖాతాకు ఒక స్పష్టమైన ప్రయోజనం ఉండాలి. అలా కాదని.. కేవలం ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వంటి స్వల్ప ప్రయోజనాల కోసం మాత్రమే కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం మంచిది కాదు. కాబట్టి మళ్లీ కొత్త అకౌంట్ తీసుకోవాలంటే.. కొన్ని విషయాలు గర్తుంచుకోండి.

మీరు ఉన్న అకౌంట్లే కాకుండా కొత్తది తీసుకోవాలి అనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.. మీ పాత అకౌంట్ల కంటే కొత్త వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. తీసుకునే కొత్త అకౌంట్‌లో మినిమమ్ బ్యాలన్స్ ఎంత మెయింటేన్ చేయాలి. మినిమమ్ బ్యాలన్స్ మెయింటేన్ చేయకపోతే ఏమైనా ఛార్జెస్ వేస్తారా? డిజిటల్ బ్యాంకింగ్ సేవల ప్రయోజనాలు, భద్రతా ఫీచర్లు ఏమిటి? అనేది తెలుసుకోవాలి. ఇలా అన్ని తెలుసుకున్న తర్వాత మీకు అకౌంట్ తీసుకోవడం అనేది ముఖ్యం అనుకుంటేనే మళ్లీ కొత్త అకౌంట్ తీసుకోండి.