
మార్కెట్ అన్ని రకాల పండ్లు నిగనిగలాడుతూ ఉంటాయి ఇవి ఎక్కువ రోజులు ఉంటాయని పండ్లను ఇంటికి కొనుక్కొని మరి తీసుకువెళతారు. తీరా ఇంటికి వెళ్ళి తెచ్చిన పండ్లను కట్ చేసి చుస్తే లోపల మొత్తం పురుగులే ఉంటాయి. ఆశగా తిందాం అని అనుకుంటే కానీ లోపల వెళ్ళి పురుగులు కనిపిస్తే.. ఎందుకు తెచ్చామా అని ఫీల్ అవ్వక తప్పదు.

అయితే పండు బయటకు చాలా మంచిగా ఉంటుంది కానీ పండు లోపలికి పురుగులు ఎలా వచ్చాయో తెలియక చాలా మంది సతమవుతూ ఉంటారు మళ్ళీ పైన ఎలాంటి రంథ్రాలు కూడా ఉండవు. అసలు ఈ పండులోకి పురుగులు ఎలా వచ్చాయి? దీని వెనకున్న కారణం ఏంటో ఇక్కడ చూద్దాం..

చెట్టుపైన పండు పండిన తర్వాత పురుగులు లోపలికి అంత ఈజీగా వెళ్ళలేవు. పండు చిన్నగా ఉన్నప్పుడే 'ఫ్రూట్ ఫ్లైస్' అనే ఈగలు లేత కాయలపై వాలి, సూది లాంటి అవయవంతో బయట భాగంలో గుచ్చి ఆ తరవాత లోపల గుడ్లు పెడతాయి. నిజం చెప్పాలంటే ఈ రంధ్రాలు కంటికి అస్సలు కనిపించనంత చిన్నగా ఉంటాయి.

మన శరీరానికి గాయమైతే చర్మం మీద ఎలా మానిపోతోందో, ఈ చెట్టుపై ఉన్న కాయ కూడా అలాగే. ఈ చిన్న ఈగలు గుడ్డు పెట్టినప్పుడు తొక్కపై.. పండు మొత్తం పెరిగి పెద్దదయ్యే వరకు దీనిలో ఉండే కణజాలం పెద్దగా అవుతుంది. అందువల్ల పండు పండిన తర్వాత బయటికి రంధ్రం లేకపోయినా కూడా పురుగు వెళ్లినట్లు అస్సలు కనిపించదు.

ఇంకా ఈ కాయ లోపల ఆ కీటకం పెట్టిన గుడ్లు, కొద్దీ రోజులకు చిన్న పురుగులుగా మారి పండును మొత్తాన్ని డ్యామేజ్ చేస్తాయి. అలాగే బయటి నుంచి ఎలాంటిది లేకుండా, ఈ పండు లోపల ఉండే గుజ్జునే ఆహారంగా తింటూ అవి పెరుగుతాయి. మనం ఆ పండును కట్ చేసే వరకు కూడా తెలీదు అవి లోపలే ఉంటాయి.