
తమళపాకు ఆరోగ్య ప్రయోజనాలు: భారతదేశంలో పండుగలు, శుభకార్యాల సమయంలో దేవునికి తమలపాకులను నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే పెద్దలకు గౌరవ సూచకంగా తమలపాకుల తాంబూలాన్ని ఇస్తారు.అయితే ఈ తమళపాకుల్లో మన శరీరానికి కావాల్సిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది గ్రహించరు. ఈ తమలపాకులు మనకు వర్షాకాంలో వచ్చే అనేక సమస్యలను నయం చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. 2 స్పూన్ల తమలపాకు రసంలో అర స్పూన్ తేనె కలిపి తీసుకుంటే నరాలకు బలంతో పాటు చిగుళ్ల నొప్పులు, రక్తస్రావం తగ్గి, పళ్ళు గట్టిగా ఉండటానికి సహాయపడుతాయి. అలాగే నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.

జ్ఞాపకశక్తి పెరుగుదల: తమలపాకు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అజీర్ణాన్ని పోగొట్టి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కడుపులోని గ్యాస్‌ను బయటకు పంపుతుంది. మెదడు, గుండె, కాలేయం , ప్లీహంలను బలపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది. నరాల వ్యవస్థకు బలాన్ని ఇస్తుంది కాబట్టి చదువుకునే పిల్లలకు తమలపాకు రసం ఇస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది: జుట్టు రాడంతో బాధపడుతున్న వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతాయి. తమలపాకును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా, ఇది జుట్టు మెరుపును పెంచి ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. తమలపాకులోని మూలికా గుణాలు తలలో దురద, చుండ్రు, జుట్టు చిట్లడం వంటి సమస్యలను నయం చేయడానికి సహాయపడతాయి.

బరువు తగ్గేందుకు సహాయం: తమలపాకులను మితంగా తీసుకోవడం వల్ల పురుషుల్లో నపుంసకత్వం తొలగిపోతుంది. తమలపాకు రసంలో తగినంత నీరు, పాలు కలిపి రోజూ తాగితే మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. అలాగే ఆవనూనెలో తమలపాకు వేసి వేడి చేసి, ఒక గుడ్డలో ఉంచి ఛాతీపై కడితే శ్వాసకోశ సమస్యలు, దగ్గు అదుపులోకి వస్తాయి. 2 తమలపాకులలో 5 మిరియాలు ఉంచి పరగడుపున నమిలి ఆ రసాన్ని మాత్రమే మింగాలి. ఇలా రెండు నెలల పాటు చేస్తే ఈజీగా బరువు తగ్గుతారు.

పెయిన్ కిల్లర్: తమలపాకు ఒక అద్భుతమైన పెయిన్ కిల్లర్, ఇది నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. దెబ్బలు, రాపిడులు, దద్దుర్ల వల్ల వచ్చే నొప్పులను తగ్గించడానికి దీనిని ఉపయోగించవచ్చు. లేత తమలపాకులను పేస్ట్‌లా నూరి నొప్పి ఉన్న చోట రాయాలి. తమలపాకు రసం తీసుకోవడం వల్ల శరీర అంతర్గత నొప్పుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.