
మనం వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ హోటల్స్‌లో బస చేసినప్పుడూ మన గోప్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి హోటల్‌కు వెళ్లినప్పుడూ కేవలం రూమ్ మాత్రమే నీట్‌గా ఉందా లేదా అనేది చూడకుండా.. గదిలో విశ్రాంతి తీసుకునే ముందు కొన్ని నిమిషాలు రూమ్‌లోని అన్ని అంశాలను క్షుణ్నంగా గమనించండి.

మీకు హోటల్‌కు వెళ్లినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే కొన్ని హోటల్ గదుల్లో హిడెన్ కెమెరాలు ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు రూమ్‌లోకి వెళ్లాక.. అక్కడ ఉన్న అలారం గడియారాలు, యూఎస్‌బీ ఛార్జర్లు, స్విచ్ బోర్డులు, ప్లగ్ పాయింట్లు, ఫోటో ఫ్రేమ్‌లు, అద్దాలు, రూమ్ డెకరేషన్ వస్తువులు మధ్య ఏవైనా కెమెరాలు దాచారో లేదా అని నిశితంగా పరిశీలించండి. వాటిని గుర్తించేందుకు మీ గదిలో లైట్స్ ఆపేసి మీ ఫోన్ కెమెరా లెన్స్ ద్వారా చూస్తే.. సీక్రెట్ కెమెరాస్ ఉన్న ప్రదేశాల్లో రెడ్ లేదా ఆకుపచ్చ రంగు కనిపిస్తాయి. ఏదైనా వస్తువుపై అనుమానం వస్తే వెంటనే దాన్ని ఫోటో తీసి, హోటల్ యాజమాన్యానికి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి.

చాలా హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో ఫ్రీ వైఫై ఉంటుంది. అయితే ఈ పబ్లిక్ నెట్‌వర్క్‌లన్నీ పూర్తిగా సురక్షితమైనవని కాకపోవచ్చు. కాబట్టి మీ హోటల్‌లో ఉన్న వైఫై వాడేప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ పేమెంట్స్ అస్సలూ చేయకండి. మీకు ఎమర్జెన్సీ లావాదేవీలు ఉంటే.. మీ సొంత డేటాను ఉపయోగించి మాత్రమే చేయండి. వైఫై వాడే ముందు హోటల్ నిర్వాహకుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే కనెక్ట్ చేసుకోండి.

అలాగే హోటల్‌లో ఉండే స్మార్ట్ టీవీలు, స్మార్ట్ స్పీకర్లను మీ ఫోన్‌తో కనెక్ట్ చేసి వాడేటప్పుడు జాగ్రత్త వహించండి. టీవీలలో ఏవైనా ఓటీటీ యాప్స్ వాడితే, రూమ్ ఖాళీ చేసే ముందు కచ్చితంగా లాగౌట్ చేయండి. ఇలాంటి పరికరాల్లో బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ నమోదు చేయవద్దు.

మీరు ఏదైనా తెలియని ప్రదేశాలకు వెళ్తుంటే.. ముందే కొన్ని జాగ్రత్తలు వహించాలి.. మీ మొబైల్, ల్యాప్‌టాప్‌లకు సెక్యూర్‌గా ఉండే స్ట్రాండ్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి. ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా ఈజీగా గుర్తించేందుకు మీ ఫోన్లోని Find My Device ఆప్షన్‌ను ఆన్‌లో ఉంచుకోండి. ఈ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీరు తెలియని ప్రదేశాల్లోకి వెళ్లినా సేఫ్‌గా ఉండొచ్చు.