
రోటీ అనేది భారతీయ వంటకాల్లో ముఖ్యమైన భాగం, దాదాపు ప్రతి ఇంట్లో రోజూ ఉండే ఐటమే ఇది. ప్రజలు సాధారణంగా సాదా గోధుమ చాపాతీ లేదా పరాఠా తింటారు, కానీ కొన్నిసార్లు వారు వెరెటీగా ఏదైనా తినాలి కోరుకుంటారు. అలాంటి వారికి రూమాల్ రోటీ గొప్ప ఎంపిక. ఇది సన్నగా, మృదువుగా రుచికరంగా ఉంటుంది. ఇది సాధారణంగా రెస్టారెంట్లు, ధాబాలలో, వివాహ వేడుకల్లో కనిపిస్తుంది. దీని పక్కకు ఒక మంచి కర్రీ చేసుకొని తింటే ఆహా ఆ టస్టేస్ట్ అదిరిపోతుందంటే.

కాబట్టి ఇప్పుడ ఇంట్లోనే రుమాలి రోటీని సులభంగా తయారు చేసుకునే విధానాన్ని మేము మీకు తెలియజేస్తాము.ఇంట్లో రుమాల్ రోటీ తయారు చేసుకునేందుకు మనకు పెద్దగా ఖర్చు ఏం కాదు. చాపాతీలు చేసుకున్నట్టే దీన్ని సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇందుకోసం ముఖ్యంగా మనకు 3 కప్పుల గోధుమ పిండి ,1 కప్పు పిండి ,2 కప్పుల నీరు (పిండిని పిసికి కలుపుకోవడానికి) ,పొడి పిండి (రోటీ చుట్టడానికి) ఉంటే సరిపోతుంది

రుమాలి రోటీని తయారు చేయడం ఎలా: ఇంట్లో రుమాల్ రోటీ చేసుకునేందుకు ముందుగా, ఒక గిన్నెలో గోధుమ పిండి, శుద్ధి చేసిన పిండి వేసి బాగా కలపాలి. దానిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా, కొద్దిగా జిగటగా ఉండే పిండిని పిసికి కలుపుకోవాలి. తర్వాత పిండిని మూతపెట్టి 2 నుండి 3 గంటలు పక్కన పెట్టాలి, తద్వారా అది బాగా సెట్ అవుతుంది.

ఇప్పుడు పిండితో చిన్న చిన్న బంతులు తయారు చేసుకోవాలి. తర్వాత పిండి సన్నగా గుడ్రంగా సాగదీయయం.ఇప్పుడు పాన్ ని తలక్రిందులుగా గ్యాస్ మీద ఉంచి బాగా వేడి చేయండి. ఇప్పుడు మీరు గుడ్రంగా చుట్టుని రోటీని పెనంపై వేసి అధిక వేడి మీద 10-12 సెకన్ల పాటు ఉడికించాలి. రోటీపై చిన్న బుడగలు కనిపించి, అడుగు భాగం లేత గోధుమ రంగులోకి మారినప్పుడు, దానిని తిప్పండి.

రెండో వైపు కూడా లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. రోటీ సిద్ధమైన తర్వాత, దానిని పాన్ నుండి తీసి, నాలుగు భాగాలుగా మడిచి వేడిగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. దాని పక్కకు వెజ్ లేదా నాన్‌వెజ్ కర్రీ పెట్టుకొని తింటే ఆ టేస్ట్ అదిరిపోతుంది అంతే(Note: పైన పేర్కన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి