
కానీ బయట మార్కెట్‌లో కొనుగోలు చేసి వాడకుండా, ఇంటిలోనే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకొని వాడటం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇది అనేక రకాల సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు : బాదం , జీడిపప్పు, పిస్తా పప్పులు, వాల్ నట్స్, ఖర్జూర, వేయించిన శనగపప్పులు, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మఖానా, పటిక బెల్లం, కుంకుమ పువ్వు, ఎండు ద్రాక్ష.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత వాటిలో బాదం, వాల్ నట్స్ ,జీడిపప్పులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఖర్జూరా, ఫూల్ మఖానా, సన్ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్‌లో చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునే సమయంలో కుంకుమ పువ్వు , స్పటిక బెల్లం, యాలకుల పొడి, ఖర్జూరాలు వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పొడి గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.

అంతే మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్ పౌడర్ రెడీ. దీనిని ప్రతి రోజూ, గ్లాస్ పాలల్లో వేసుకొని తాగడం వలన ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.