
కావాల్సిన పదార్థాల్లోకి వెళితే.. వెల్లుల్లి రెండు కప్పులు, నిమ్మ రసం అరకప్పు కంటే కాస్త ఎక్కువ, ధనియాలు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్, జీలకర్ర ఒక టీ స్పూన్, మెంతులు ఒక టీస్పూన్, పసుపు చిటికెడు, కారం పొడి నాలుగు టీ స్పూన్స్, నూనె, ఉప్పు మీ రుచికి సరిపడ.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా వెల్లుల్లి ఊరగాయ పచ్చడిలోకి కావాల్సిన మసాలా పొడిని తయారు చేసుకోవాలి. దాని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో ముందుగా జీలకర్ర వేసి మంచిగా వేయించి వేరే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మెంతులు , ధనియాలు ఇలా అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఎండు మిర్చీ కూడా ఒకటి తీసుకొని వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీజార్‌లో వేసి మంచిగా మెత్తని పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందు నూనె వేసి అది వేడి చేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వత అందులో వెల్లుల్లి వేయాలి. దీనిని బాగా వేయించుకోవాలి.

వెల్లుల్లి బాగా వేగింది అని మీకు అనిపించిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మరసం పోయాలి. ఇది పోయడం వలన అది దగ్గరగా వచ్చి చిక్కబడుతుంది. ఇలా చిక్కబడే వరకు దీనిని కలుపుతూనే ఉండాలి.

అది ఊరగాయలా కనిపిస్తుంది. అప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఇందులో వేసి మరో ఐదు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి వెల్లుల్లి ఊరగాయ సిద్ధం. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా దగ్గు జలుబు ఉన్న సమయంలో ఒక్క పూట దీంతో తిన్నా చాలా మంచిది.