
సమర్లకో ఎంతో మంది చల్లటి పెరుగుతో తింటారు అంతే కాదు ఇది లేకుండా భోజనం అసంపూర్ణంగా ఉంటుంది. ఇంకొందరు మజ్జిగ, లస్సీలు ,పెరుగు, రైతా,ఇలా ఏదోక రకంగా తమ ఆహారంలో తీసుకుంటారు. అయితే, కొన్నిసార్లు రాత్రిపూట తోడు పెట్టడం మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో మార్కెట్ వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

అయితే, అలా కాకుండా ఈ పాత కాలం చిట్కాతో 15 నుంచి 20 నిమిషాల్లోనే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే చిక్కటి పెరుగును సిద్ధం చేసుకోవచ్చు. మీకు ఇది వినడానికి కొంచం కొత్తగా ఉన్నా ప్రెషర్ కుక్కర్ తో మార్కెట్‌లో దొరికే పెరుగును తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇది వేసవిలో ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మరి, ఇదేలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ప్రెషర్ కుక్కర్‌తో పెరుగు గడ్డకట్టించే సులభమైన విధానం : ముందుగా పాలను తీసుకుని వాటిని బాగా మరిగించాలి. ఆ తరవాత గోరువెచ్చగా అయ్యే వరకువాటిని బాగా చల్లారనివ్వాలి. అయితే, ఈ పాలు బాగా వేడిగా ఉండకూడదు. అలా ఉంటే పెరుగులాగా మారిన తరవాత పుల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరు వెచ్చగా ఉంటే చాలు.

ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో పెరుగు స్టార్టర్ తీసుకుని, దానిలో గోరువెచ్చని పాలను పోయాలి. దీని వలెనే పెరుగు గడ్డకడుతుంది. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో ఈ పెరుగు ఉన్న గిన్నెను ఉంచి మూత పెట్టాలి. ఇలా కుక్కర్‌ను మీరు 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఆ గిన్నెను బయటకు తీసి ఉంచితే పెరుగు లాగా మారుతుంది.

ప్రెషర్ కుక్కర్‌లో ఉండే వేడి వలన పాలలో ఉండే బ్యాక్టీరియా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. అందువలన పెరుగు కొద్దీ నిముషాల్లోనే చిక్కగా గడ్డకడుతుంది. ఇంకా చల్లటి వాతావరణంలో ఈ టిప్ పాటిస్తే మంచిగా పనిచేస్తుంది. మీకు త్వరగా పెరుగు కావాలనుకుంటే ఇది పాటించండి. మీరు రోజూ తిన్న పెరుగులాగే ఉంటుంది.