ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. ఉసిరి పచ్చడి ఇలా పెడితే టేస్ట్ అదుర్స్

Updated on: Nov 17, 2026 | 12:22 PM

శీతాకాలం వచ్చింది అంటే చాలు చాలా మంది ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంత మందికి ఇది పుల్లగా, కాస్త వగరుగా ఉండటంతో ఎలా పెట్టాలో తెలియదు. కానీ, ఈ రోజు మనం చాలా రుచికరంగా ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం. పదండి.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..  ఉసిరికాయలు: 1/2 కిలో,   చింతపండు: 50 గ్రాములు,   నూనె: 1 1/2 కప్పు , మెంతులు: 1 టీస్పూన్,  ఆవాలు: 2 టీస్పూన్లు (మసాలా కోసం) + 1 టీస్పూన్ ,  జీలకర్ర: 1 టీస్పూన్ ,   ఇంగువ: 1/4 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: 10-15,  కారం: 1/2 కప్పు కంటే 1 టేబుల్‌స్పూన్ ఎక్కువ, ఉప్పు: 1/4 కప్పు కంటే కొద్దిగా తక్కువ.

2 / 5
తయారీలోకి వెళ్లితే.. అర కిలో ఉసిరికాయలను నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత పొడి వస్త్రంతో తడి లేకుండా పూర్తిగా తుడిచి, ఫ్యాన్ కింద అరగంట పాటు ఆరబెట్టాలి. తడి అస్సలు ఉండకూడదు, ఇది పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ముఖ్యం. తర్వాత  50 గ్రాముల చింతపండును ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి 20 నిమిషాలు నానబెట్టాలి. గోరువెచ్చని నీళ్లు పోస్తే త్వరగా నానుతుంది. నానిన తర్వాత చేతితో బాగా పిసికి గుజ్జును వేరు చేయాలి. మిగిలిన పిప్పిలో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ పిసికి గుజ్జును పూర్తిగా తీసివేయాలి. ఈ గుజ్జును స్టవ్ పైన పెట్టి మీడియం మంటపై చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత పూర్తిగా చల్లార్చాలి.

3 / 5
అదే స్టవ్ పైన మరొక పాన్ పెట్టి, 1 టీస్పూన్ మెంతులు, 2 టీస్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా, ఎర్రగా వేయించాలి. మాడకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చి, మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక 1 1/2 కప్పుల నూనెను వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత శుభ్రం చేసి ఆరబెట్టుకున్న ఉసిరికాయలను వేసి మీడియం మంటపై వేయించాలి. ఉసిరికాయలు రంగు మారి, మెత్తబడే వరకు వేయించుకోవాలి. గరిటతో నొక్కితే సులభంగా లోపలికి దిగబడేంత వరకు వేగాలి. వేగిన తర్వాత ఉసిరికాయలను తీసి ఒక ప్లేట్‌లో పెట్టి పూర్తిగా చల్లార్చాలి.

4 / 5
 ఉసిరికాయలు వేయించిన అదే నూనెలో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు వేగిన వెంటనే స్టవ్ ఆపివేయాలి. ఆ వేడిమీదే 1/4 టీస్పూన్ ఇంగువ వేయాలి. తర్వాత 10-15 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసి కలపాలి. ఈ పోపును కూడా పూర్తిగా చల్లార్చాలి.  చల్లారిన ఉసిరికాయల నుండి గింజలను తీసివేయాలి.  ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత  చింతపండు రసంలోసిరికాయ ముక్కలు వేయాలి. దీనికి మెంతులు-ఆవాల పొడి, దంచిన వెల్లుల్లి, 60 గ్రాముల కారం, 40 గ్రాముల ఉప్పు వేయాలి. చివరిగా, చల్లారిన పోపును నూనెతో సహా వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.

5 / 5
పచ్చడిని బాగా కలిపిన తర్వాత ఒక రెండు రోజులు పక్కన పెట్టాలి. రెండు రోజుల తర్వాత ఉప్పు, కారం, పులుపు సరిపోయాయో లేదో రుచి చూసి, అవసరమైతే సర్దుబాటు చేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువగా తినే వారు కొద్దిగా అదనంగా కలుపుకోవచ్చు. కారం మాత్రం సూచించినంత వేస్తే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us