Health Tips: మలబద్ధకం సహా అనేక ఇతర సమస్యలకు ఈ పానీయాలు బెస్ట్ మెడిసిన్.. ఎలా తీసుకోవాలంటే

|

Jun 28, 2024 | 1:19 PM

ప్రస్తుతం తప్పుడు ఆహారపు అలవాట్లు, దిగజారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. బయట తింటున్నారు. లేదా సమయం కాని సమయుంలో అనారోగ్యకరమైన ఆహారాన్ని , వేయించిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అదే సమయంలో శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. కనీసం నడక, వ్యాయామం వంటి వాటికి కూడా దూరంగా ఉంటున్నారు. అటువంటి పరిస్థితిలో జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. గ్యాస్ , మలబద్ధకం వంటి సాధారణ సమస్యల బారిన పడి ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువమంది మందులు తీసుకుంటారు. అయితే వంటింట్లో దొరికే వస్తువులతో చిట్కాలు కూడా ఉపశమనం కలిగిస్తాయి.

1 / 6
జీర్ణక్రియ లేదా ఏదైనా జీర్ణ సంబంధ ఆరోగ్య సమస్య తీవ్రం అయితే.. ఉపశమనం కోసం ఇంటి చిట్కాలను పాటిస్తారు. రకరకాల పానీయాలు తీసుకుంటారు. నిమ్మరసం జ్యూస్ గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం, UTI, మధుమేహం, జీర్ణక్రియకు సంబంధించిన ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి  డైటీషియన్ గుంజన్ కొన్ని సలహాలను ఇచ్చారు.

2 / 6

మలబద్ధకం: ప్రస్తుతం మలబద్ధకంతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అటువంటి పరిస్థితిలో సబ్జా గింజల నీరు మలబద్ధకం సమస్య నివారణకు బెస్ట్ మెడిసిన్. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి సుమారు 15 నిమిషాలు నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.

3 / 6
జీర్ణక్రియ సంబంధిత సమస్యలు: అల్లం నీరు ఎసిడిటీ, వాపు, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ముందుగా అల్లం తొక్క తీసి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలను 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ అల్లం ముక్కలను 4 కప్పుల నీటిని ఒక పాత్రలో వేసి కనీసం 10 నిమిషాలు ఆ నీటిని మరిగించాలి. అనంతరం అల్లం నీటిని తాగడం ప్రారంభించాలి.

4 / 6
UTI: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సమస్య నుండి ఉపశమనం అందించడంలో బియ్యం నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం సగం కప్పు పచ్చి బియ్యం తీసుకోవాలి. తర్వాత బియ్యం పూర్తిగా కడగాలి. బియ్యాన్ని ఒక గిన్నెలో 2 నుండి 3 కప్పుల నీటితో 30 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు బియ్యం నీటిని తీసుకుని ఒక గాజు గ్లాస్ లో తీసుకుని తాగాలి.

5 / 6
కాళ్లు చేతులు నీరు పడుతుంటే:  నిమ్మరసం నీరు శరీరంలోని నీరు పట్టిన సమస్యకు మంచి నివారణ. దీని కోసం మీరు 1 గ్లాసు వేడి నీటిలో సగం నిమ్మకాయను పిండాలి.. ఖాళీ కడుపుతో నిమ్మరసం నీటిని తాగాలి.

6 / 6
డయాబెటిస్‌: డయాబెటిస్‌ సమస్యతో ఇబ్బంది పడుతుంటే మెంతి గింజల నీటిని తాగడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పెనంపై మెంతులు వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఆ గింజలను గ్రైండ్ చేసి పౌడర్ చేయాలి. ఈ పొడిని 1 టీస్పూన్ నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మంచి ప్రయోజనకారి. (ఏదైనా వ్యాధి చికిత్సకు ఔషధం చాలా ముఖ్యమైనది. అందువల్ల ఇంటి చిట్కాలపై పూర్తిగా ఆధారపడకండి. అలాగే, మీకు ఏవైనా సమస్యలు ఉంటే వీటిని తీసుకునే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.)