Meal Maker Pulao: కేవలం అరగంటలో.. హై-ప్రోటీన్ ఉండే సోయా మిల్మేకర్ పులావ్

Updated on: Oct 17, 2026 | 8:25 PM

పిల్లల లంచ్ బాక్స్‌లకు లేదా ఆఫీసుకు వెళ్లే హడావుడిలో సమయం తక్కువగా ఉన్నప్పుడు త్వరగా అయిపోవడంతో పాటు శరీరానికి పుష్కలమైన బలాన్నిచ్చే హై-ప్రోటీన్ వంటకం 'సోయా మిల్మేకర్ పులావ్'. చాలామంది సోయా చంక్స్‌తో రైస్ చేసేటప్పుడు వేడినీళ్లలో వేసి ఉడికిస్తుంటారు; దీనివల్ల మిల్మేకర్ అతిగా మెత్తబడిపోయి అన్నంలో తినేటప్పుడు రబ్బరులా చప్పగా మారుతుంది. అలా కాకుండా సాధారణ చల్లటి నీళ్లలోనే కడిగి కేవలం రెండు నిమిషాలు ఉంచి గట్టిగా పిండడం వల్ల మిల్మేకర్ జ్యూసీగా ఉంటూ మసాలాలన్నింటినీ చక్కగా పీల్చుకుంటుంది. 

1 / 5
కావలసిన పదార్థాలు: 2 గ్లాసుల బాస్మతి బియ్యం,  1 గ్లాసు సోయా చంక్స్, 3 గ్లాసుల నీళ్లు, 2 చిన్న బంగాళాదుంపలు, 1 పెద్ద క్యారెట్, 5 నుండి 6 ఫ్రెంచ్ బీన్స్, 2 చిన్న టమాటాలు, పావు కప్పు పచ్చి బఠానీలు, పావు కప్పు జీడిపప్పు పలుకులు, 1 టీస్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా దినుసులు, 2 రెమ్మల కరివేపాకు, వంట నూనె, 2 టీస్పూన్ల ధనియాలు, 2 అంగుళాల అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రెబ్బలు, 10 నుండి 12 పచ్చిమిరపకాయలు, 1 కప్పు తాజా పుదీనా ఆకులు, 1 కప్పు నిండుగా తాజా కొత్తిమీర, 1 టీస్పూన్ సోంపు గింజలు, అర చెక్క నిమ్మరసం, 2  ముక్కలుగా తరిగిన చిన్న ఉల్లిపాయలు

2 / 5
తయారీ విధానం: రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నీటిలో నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు మిల్మేకర్‌ను సాధారణ చల్లటి నీళ్లలో చేత్తో రుద్దుతూ కడగాలి. మళ్లీ నీళ్లు పోసి కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉంచి.. చేత్తో నీటిని గట్టిగా పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. వేడినీళ్లు పోయకూడదు, వేడినీళ్లలో వేస్తే మిల్మేకర్ మెత్తబడి చప్పబడిపోతుంది.

3 / 5
మిక్సీ జార్‌లో 2 టీస్పూన్ల ధనియాలు, 2 అంగుళాల అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి, 10-12 పచ్చిమిర్చి, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1 టీస్పూన్ సోంపు, అర చెక్క నిమ్మరసం మరియు 2 ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నీటితో మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. మరో బర్నర్‌పై 3 గ్లాసుల నీటిని మరిగించుకోవాలి.

4 / 5
స్టవ్‌పై కుక్కర్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడిచేయాలి. జీలకర్ర, హోల్ గరం మసాలా దినుసులు, పావు కప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్, టమాటాలు, పచ్చి బఠానీలు, కరివేపాకు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు మూతపెట్టి మగ్గించాలి.

5 / 5
నూనె తేలిన తర్వాత పిండి ఉంచుకున్న మిల్మేకర్, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మసాలా అంతా పట్టేలా లో ఫ్లేమ్‌పై 2-3 నిమిషాలు సున్నితంగా ఫ్రై చేయాలి. ఇప్పుడు పక్కన మరిగిస్తున్న 3 గ్లాసుల వేడి నీటిని పోసి ఉప్పు సరిచూసుకోవాలి. కుక్కర్ మూతపెట్టి మీడియం-హై ఫ్లేమ్‌పై కేవలం ఒక్కటంటే ఒకే విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి గరిటెతో కింద నుండి పైకి సున్నితంగా కలుపుకోవాలి. అంతే, అన్నం మెతుకు విరిగిపోకుండా పొడిపొడిలాడే కమ్మనైన 'సోయా పులావ్' సిద్ధం! దీనికి ప్రత్యేకంగా వేరే కుర్మా అవసరం లేదు; చల్లటి ఉల్లిపాయ రైతాతో సర్వ్ చేసుకుంటే లంచ్ బాక్స్‌లో పిల్లలు మెతుకు కూడా మిగల్చకుండా లాగించేస్తారు!

Loading...
Unable to load recommendations.
Follow Us