బల్లుల బెడదతో విసిగిపోయారా? అవి గుడ్లు పెట్టే ఈ 5 ప్రదేశాలను వెంటనే శుభ్రం చేయండి..!

Updated on: Mar 25, 2026 | 7:55 PM

బొద్దింకల తర్వాత ఇంట్లో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే జీవులు బల్లులు. ఇంట్లో గోడల మీద బల్లులు తిరుగుతుంటే చాలా మందికి అసహ్యం, భయం కలుగుతాయి. ముఖ్యంగా వంటగదిలో బల్లులు ఉండటం ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. అయితే, మీరు ఎన్ని బల్లులను బయటకు పంపినా, మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయంటే.. దానికి కారణం మీ ఇంట్లోనే అవి గుడ్లు పెట్టి సంతతిని పెంచుకోవడమే. అందుకే, ముందు మీరు అక్కడ ఫోకస్‌ పెట్టాల్సి ఉంటుంది. బల్లులు గుడ్లు పెట్టే ఆ రహస్య ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

1 / 6
వంటగది క్యాబినెట్లు, సింక్ కింద: బల్లులకు ఆహారం (కీటకాలు), నీరు లభించే ప్రధాన ప్రదేశం వంటగది. క్యాబినెట్ల వెనుక భాగంలో లేదా సింక్ కింద ఉండే చీకటి ప్రదేశాలలో అవి సులభంగా గుడ్లు పెడతాయి. వారానికి ఒకసారి ఈ ప్రదేశాలను ఖాళీ చేసి శుభ్రం చేయడం ముఖ్యం.

2 / 6
ఎలక్ట్రానిక్ వస్తువుల వెనుక: ఫ్రిజ్ వెనుక భాగం లేదా ఏసీ యూనిట్ల లోపల ఉండే వెచ్చదనం బల్లుల గుడ్లు త్వరగా పొదగడానికి సహాయపడతాయి. అందుకే ఇవి బల్లులకు ఇష్టమైన ప్రదేశాలు. ఈ పరికరాల వెనుక దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి.

3 / 6
ఫోటో ఫ్రేమ్‌లు, క్యాలెండర్ల వెనుక: గోడలకు తగిలించిన ఫోటోలు, గడియారాలు లేదా క్యాలెండర్ల వెనుక భాగం బల్లులకు సురక్షితమైన స్థావరాలు. అక్కడ ఎక్కువ కాలం ఎవరూ కదిలించరు కాబట్టి, అవి నిశ్చింతగా గుడ్లు పెడతాయి. వీటిని సకాలంలో గుర్తించి శుభ్రం చేయకపోతే, ఇంట్లో బల్లుల సంఖ్య వేగంగా పెరిగిపోతుంది.

4 / 6
అల్మారాలు, పాత సామాన్లు: మనం అరుదుగా ఉపయోగించే అల్మారాలు లేదా స్టోర్ రూమ్ లోని పాత పేపర్ల కట్టలు, బట్టల వెనుక బల్లులు దాక్కుంటాయి. ఇంటి మూలల్లో వెలుతురు ప్రసరించేలా చూసుకోవడం వల్ల బల్లులు అక్కడ ఉండవు. బల్లులను వదిలించుకోవడానికి నెమలి ఈకలు, కాఫీ పొడి లేదా ఉల్లిపాయ ముక్కలను ఆయా ప్రదేశాల్లో ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5 / 6
కిటికీలు, వెంటిలేటర్లు: కిటికీ రెక్కల మధ్య ఉండే సందులు, చెక్క సామాన్ల మధ్య ఉండే రంధ్రాలు బల్లులకు అనువైనవి. వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. బల్లులను వదిలించుకోవడానికి నెమలి ఈకలు, కాఫీ పొడి లేదా ఉల్లిపాయ ముక్కలను ఆయా ప్రదేశాల్లో ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

6 / 6
నివారణ చిట్కాలు: వెల్లుల్లి, ఉల్లిపాయ ఘాటైన వాసన బల్లులకు అస్సలు పడదు. నెమలి ఈకలను చూస్తే బల్లులు భయపడి ఆ ప్రాంతానికి రావు. వీటన్నంటికి ముందుగా ఇంట్లో చిన్న చిన్న పురుగులు, దోమలు లేకుండా చూసుకుంటే, ఆహారం దొరక్క బల్లులు దానంతట అవే వెళ్ళిపోతాయి. ఈ ప్రదేశాలను గుర్తించి శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మీ ఇంటిని బల్లుల రహితంగా మార్చుకోవచ్చు.

Follow Us