
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడగా.. మరో గ్యాస్ కొరత కూడా ఏర్పడింది. అదే హీలియం గ్యాస్. పార్టీలు, పంక్షన్ల సమయంలో బెలూన్లు నింపడంతో పాటు ఎంఆర్‌ఐ స్కానింగ్, సెమీ కండక్టర్ల తయారీ, ఏరోస్పోస్, ఫైబర్ ఆప్టిక్ వంటి రంగాల్లో ఈ గ్యాస్‌ను వాడుతూ ఉంటారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల సరఫరా గోలుసుకు పెద్ద దెబ్బ తగలడంతో హీలియం కొరత ఏర్పడింది. దీని వల్ల సామాన్యులపై కూడా ప్రభావం పడనుంది.

ప్రపంచవ్యా్ప్తంగా హీలియం ఉత్పత్తిలో ఖతార్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఖతార్‌లోని రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంపై ఇరార్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా హీలియం గ్యాస్ సరఫరా మూడింత ఒక వంత నిలిచిపోయింది. ఇక హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సరఫరా మరింత తీవ్రతరమైంది. దీని వల్ల ప్రపంచవ్యా్ప్తంగా హీలియం కొరత ఏర్పడింది. ఇది ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

అలంకరణ బెలూన్లను నింపడానికి హీలియం ఉపయోగిస్తారు. ఇక ప్రకటనల కోసం ఉపయోగించే బ్లింప్‌లు, పరేడ్ ఫ్లోట్‌లలో కూడా వాడతారు. ఇక గృహపకరణాలలో చిన్న లీక్‌లను గుర్తించేందుకు యూజ్ చేస్తారు. ఇక వైద్య రంగంలో దీని పాత్ర కీలకంగా ఉంది. ఎంఆర్‌ఐ స్కానింగ్ యాంత్రాలను చల్లగా ఉంచడంతో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎంఆర్‌ఐ యంత్రాలకు ఇది అత్యవసరమైనది.

స్కానింగ్ కోసం అయస్కాంతాలు పనిచేయాలంటే -269 సెంటిగ్రేడ్ టెంపరేచర్ వరకు సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలను చల్లబపరుస్తుంది. ఇక సెమీ కండకర్ల తయారీ, ఫైబర్ ఆప్టిక్స్ తయారీలో కూడా హీలియంను వినియోగిస్తారు. దీని స్వభావం వల్ల అధిక ఉష్ణోగ్రతలను, ఇతర భాగాలను చల్లగా ఉంచగలదు. ఇక మైక్రోచిప్‌ల ఉత్పత్తి సమయంలో రసాయన కాలుష్యాన్ని నివారించేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు.

హీలియం కొరత వల్ల ఎంఆర్‌ఐ స్కానింగ్ ధరలు పెరిగే అవకాశముంది. ఇక ఏరోస్పేస్ రంగంలో కూడా హీలియం గ్యా్స్ వాడతారు. రాకెట్ల ఇంధన ట్యాంకులును శుభ్రపర్చడానికి, పీడనాన్ని పెంచడానికి హీలియం గ్యాస్ వాడతారు. ఇక ఇది ద్రవ ఆక్సిజన్, హైడ్రోజన్‌కు సంబంధించిన తీవ్రమైన క్రయోజనిక్ ఉష్ణోగ్రతల వద్ద కూడా వాయువుగానే ఉంటుంది. భూమిపై చాలా అరుదుగా హీలియం ఉంటుంది. వాతావరణం నుంచి దీనిని వెలికితీయడం సాధ్యం కాదు. భూమి క్రస్ట్ లోపల లోతుగా ఇది ఉంటుంది. ఒక్కసారి గాల్లోకి విడుదల చేసిన తర్వాత శాశ్వతంగా నశించిపోతుంది.