
ఆరోగ్యమే మహాభాగ్యం అందుకే ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు తప్పకుండా పౌష్టికాహారం అందించాలి. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఫుడ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు ప్రతీ సారి మంచి పోషకాలు ఉన్న ఫుడ్ అందించలేం. అందువలన మీరు ఆరోగ్యానికి మేలు చేసే రాగి, మునగాకుతో లడ్డూ ప్రిపేర్ చేసి రోజుకు ఒకటి ఇవ్వడం వలన ఇది పిల్లలో ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుందంట. కాగా, దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు : రాగి పిండి, మునగాకు, పచ్చి మిర్చి, మినప పప్పు, ఆవాలు, నువ్వులు, ఎండు మిర్చి, బియ్యం పిండి, జీలకర్ర, ఉల్లిపాయ, నీళ్లు, కొత్తిమీర, శనగపప్పు, పచ్చి మిర్చి, కొబ్బరి తురుము, ఆవాలు, నూనె, కొత్తిమీర.

తయారీ విధానంలోకి వెళితే..ముదుగా మునగాకు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కప్పు రాగి పిండి తీసుకోవాలి. తర్వాత కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి, దానిపై ఆవాలు జీలకర్ర, ఎండు మిర్చీ, ఇంగువ వేసి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత పక్కన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్లీస్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, కొంచెం నూనె పోసి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ, పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోయాలి. తర్వాత ఈ నీటిలో మునగాకు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని పక్కన పెట్టుకోవాలి. నీరు గోరు వెచ్చగా ఉన్న సమయంలోనే, అందులోబియ్యం పిండి, రాగి పిండి వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఆ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత చేతికి నెయ్యి లేదా నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మునగాకు ఉండలు రెడీ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలు తినడం వలన వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.