
కావలసిన పదార్థాలు: ప్లెయిన్ ఓట్స్ అర కప్పు, గుడ్లు 2 నుండి 3, 1 మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగినది, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, తురిమిన 1 క్యారెట్, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, పావు టీస్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, పాన్‌పై స్ప్రెడ్ చేయడానికి వంట నూనె

తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్‌ను శుభ్రం చేసి తురుము పీటపై సన్నగా తురుముకోవాలి. క్యారెట్‌తో పాటు లేదా క్యారెట్ లేకపోతే బీట్రూట్ తురుమును కూడా వేసుకోవచ్చు. కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి.

ఒక మిక్సింగ్ బౌల్లోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము తీసుకోవాలి. ఇందులోనే అర కప్పు ప్లెయిన్ ఓట్స్ వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ కారం పొడి వేయాలి. ఎలాంటి ఇతర గరం మసాలాలు అవసరం లేదు. ఇందులో మొదట రెండు గుడ్లను పగలగొట్టి వేయాలి. స్పూన్‌తో ఓట్స్, కూరగాయలు, గుడ్లు సమంగా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. మిశ్రమం మరీ పొడిగా అనిపిస్తే మరొక గుడ్డును కూడా పగలగొట్టి వేసి జారుడు బ్యాటర్లా కలుపుకోవాలి.

స్టవ్‌పై నాన్‌స్టిక్ లేదా దోశ పాన్ పెట్టి వేడిచేయాలి. పాన్ వేడయ్యాక డైట్ రెసిపీ కాబట్టి కేవలం అర టీస్పూన్ నూనె మాత్రమే వేసి పాన్ అంతటా బ్రష్ లేదా స్పూన్‌తో పల్చగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న ఓట్స్-ఎగ్ మిశ్రమాన్ని పాన్ మధ్యలో వేసి.. మరీ మందంగా కాకుండా స్పూన్‌తో సమానంగా రౌండ్‌గా స్ప్రెడ్ చేయాలి.

మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచాలి. హై ఫ్లేమ్‌లో పెడితే కింద మాడిపోయి పైన ఓట్స్ ఉడకవు. మూతపెట్టి ఒకటి నుండి రెండు నిమిషాల పాటు ఆవిరిపై ఉడకనివ్వాలి. అడుగు భాగం చక్కగా కాలి గట్టిపడిన తర్వాత.. జాగ్రత్తగా అట్లకాడతో రెండో వైపుకు తిప్పాలి. అటువైపు కూడా సిమ్ మంటపైనే మరో నిమిషం పాటు కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'ఓట్స్ ఆమ్లెట్' సిద్ధం! దీనిని ముక్కలుగా కట్ చేసుకుని ఇష్టమైతే కొద్దిగా టమాటా సాస్‌తో నంజుకుని తింటే దోశ తిన్న అనుభూతితో పాటు కడుపు నిండుగా ఉండి బరువును సులభంగా అదుపులో ఉంచుతుంది!