పిల్లలకు పదే పదే మార్కెట్‌లో బిస్కెట్స్ కొంటున్నారా? మీ కోసమే ఈ సూపర్ రిసిపీ

Updated on: Oct 03, 2026 | 6:05 PM

పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి బిస్కెట్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా పిల్లలు కూడా పదే పదే బిస్కెట్స్ కావాలి అంటూ మారం చేస్తుంటారు. ఇక దీంతో పేరెంట్స్ కూడా బయట షాపుల్లో శుద్ధి చేసిన పిండి, అధిక చక్కెర , నిల్వ చేసిన బిస్కెట్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇవి పిల్లల ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు.

1 / 5

2 / 5
 అయితే ఇలా పదే పదే బయట బిస్కెట్స్ కొనుగోలు చేయకుండా ఇంటిలోనే సులభంగా తయారు చేసుకోవచ్చునంట. గోధుమ పిండి, బెల్లంతో ఆరోగ్యకరమైన బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. కావలసిన పదార్థాలు:   గోధుమపిండి: 2 కప్పులు,  బెల్లం తురుము,  నీళ్లు, బొంబాయి రవ్వ,  డెసికేటెడ్ కొబ్బరి పొడి, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు,  ఉప్పు చిటికెడు,  డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె

3 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. బిస్కెట్స్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి, బౌల్ పెట్టి అందులో, కప్పు  బెల్లం తురుము,  కప్పు నీళ్లు పోసి, బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి. పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. కరిగిన బెల్లం నీళ్లను పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో రెండు కప్పుల  గోధుమ పిండి వేయాలి.  ¼ కప్పు బొంబాయి రవ్వ, ¼ కప్పు డెసికేటెడ్ కొబ్బరి పొడి , 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.

4 / 5
తర్వాత ఈ మిశ్రమంలో నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. దగ్గరగా ఉండలా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. నెయ్యితో పాటు నూనె కలుపుకున్నా పర్వాలేదు. అలాగే మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీటిని ఇందులో పోస్తూ మంచిగా కలుపుకోవాలి. దీంతో పిండి గట్టిగా కాకుండా కాస్త మెత్తగా కలుపుకొని పదినిమిషాల పాటు క్కన పెట్టుకోవాలి.

5 / 5
 పది నిమిషాల తర్వాత, నానిన పిండిలో నుంచి కొద్దిగా తీసుకుని బిస్కెట్స్ ఆకారంలో కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేయండి. నూనె కాస్త వేడికాగా, అందులో  మీరు తయారు చేసుకున్న బిస్కెట్స్ వేసి బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోండి.  బిస్కెట్లు బాగా వేగిన తర్వాత, నూనె నుంచి తీసి పేపర్ నాప్‌కిన్ వేసిన ప్లేట్‌లో ఉంచండి అంతే టేస్టీ టేస్టీ బిస్కెట్స్ రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us