రక్తాన్నిపెంచే రోటి పచ్చడి.. తిన్నారంటే రక్తహీనతతో పాటు ఎన్నో రోగాలు నయమవుతాయ్

Updated on: May 08, 2026 | 12:18 PM

Homemade roti pachadi in telugu: రక్తాన్నిపెంచే రోటి పచ్చడి.. దీనిని మీరు ఒకసారి తిన్నారంటే రక్తహీనతతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు మాయం అవుతాయి. మరి, ఇంకేందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం ..

1 / 5
క్యారెట్ రోటి పచ్చడి రెసిపీ కావాల్సిన పదార్థాలు:  4 చిన్న క్యారెట్లు,  ఒక పెద్ద ఉల్లిపాయ,  నాలుగు పచ్చిమిర్చి,  5 వెల్లుల్లి రెబ్బలు,   
 ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  ఒక టీ స్పూన్  శనగపప్పు,  ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు,  రెండు ఎండు మిర్చి, చింతపండు,   
రుచికి   సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

క్యారెట్ రోటి పచ్చడి రెసిపీ కావాల్సిన పదార్థాలు: 4 చిన్న క్యారెట్లు, ఒక పెద్ద ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, రెండు ఎండు మిర్చి, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
క్యారెట్ రోటి పచ్చడి రెసిపీ తయారీ విధానం:   
ముందుగా ఇలా వేయించుకోవాలి: ముందుగా గ్యాస్ వెలిగించి పాన్‌లో నూనె వేసి శనగపప్పు, ఒక టీ  స్పూన్ మినప్పప్పు, ఒక  టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి కూడా  వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత  నాలుగు వెల్లుల్లి, రెండు పచ్చిమిర్చి, ఉల్లిపాయ  ముక్కలు వేసి   గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి.

క్యారెట్ రోటి పచ్చడి రెసిపీ తయారీ విధానం: ముందుగా ఇలా వేయించుకోవాలి: ముందుగా గ్యాస్ వెలిగించి పాన్‌లో నూనె వేసి శనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి కూడా వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత నాలుగు వెల్లుల్లి, రెండు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి.

3 / 5
 క్యారెట్ ఇలా ఉడికించుకోవాలి: ఇప్పుడు కట్ చేసిన క్యారెట్ ముక్కలు దీనిలో వేసి 10   నిమిషాల పాటు  వీటిని మగ్గించాలి. 
క్యారెట్ ముక్కలు బాగా మెత్తగా అయిన తరవాత చింతపండు  కూడా దీనిలో వేసి కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి. మెత్తగా ఉడకకపోతే పచ్చడి మంచి టేస్ట్ ఉండదు.

క్యారెట్ ఇలా ఉడికించుకోవాలి: ఇప్పుడు కట్ చేసిన క్యారెట్ ముక్కలు దీనిలో వేసి 10 నిమిషాల పాటు వీటిని మగ్గించాలి. క్యారెట్ ముక్కలు బాగా మెత్తగా అయిన తరవాత చింతపండు కూడా దీనిలో వేసి కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి. మెత్తగా ఉడకకపోతే పచ్చడి మంచి టేస్ట్ ఉండదు.

4 / 5
 రోటిలో ఇలా నూరుకోవాలి: ఈ మిశ్రమం ఫ్యాన్ కింద పెట్టి, ఆ తర్వాత దీనిని మిక్సీ జార్‌లో వేసి  రుచికి  సరిపడా ఉప్పును దీనిలో వేసి,  
 కొంచం ముద్దలాగా దీనిని బాగా నూరుకోవాలి. అలాగే, ఇది మెత్తగా నూరుకోకుండా కొంచం కచ్చా పచ్చాగా దంచితే రుచి సూపర్ ఉంటుంది.

రోటిలో ఇలా నూరుకోవాలి: ఈ మిశ్రమం ఫ్యాన్ కింద పెట్టి, ఆ తర్వాత దీనిని మిక్సీ జార్‌లో వేసి రుచికి సరిపడా ఉప్పును దీనిలో వేసి, కొంచం ముద్దలాగా దీనిని బాగా నూరుకోవాలి. అలాగే, ఇది మెత్తగా నూరుకోకుండా కొంచం కచ్చా పచ్చాగా దంచితే రుచి సూపర్ ఉంటుంది.

5 / 5
చివర్లో తాలింపు పెట్టుకోవాలి: చివర్లో మళ్లీ పాన్‌ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, దానిలో నూనె చేసి ఒక టేబుల్ స్పూన్  ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు వేసి తాలింపు పెట్టి, దానిని   పచ్చడిపై పోసుకోవాలి.

చివర్లో తాలింపు పెట్టుకోవాలి: చివర్లో మళ్లీ పాన్‌ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, దానిలో నూనె చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు వేసి తాలింపు పెట్టి, దానిని పచ్చడిపై పోసుకోవాలి.

Follow Us