Health Tips: వండాల్సిన అవసరం లేదు.. వీటిని డైరెక్ట్‌గా తింటేనే ఆరోగ్యానికి మంచిదట!

Updated on: May 03, 2026 | 2:41 PM

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఉడికించి తినడం కంటే పచ్చిగా తిన్నప్పుడే వాటిలోని పోషకాలు మన శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి. ఇది తెలియక చాలా మంది వాటిని వండుకొని తింటారు. అయితే వేడి చేయడం వల్ల వాటిలో ఉండే కొన్ని విటమిన్లు, ఖనిజాలు నశిస్తాయి. కాబట్టి వండకుండా నేరుగా తినే ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
క్యారెట్‌లు: క్యారెట్లలో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరం దీనిని విటమిన్-A గా మారుస్తుంది, ఇది కంటి చూపుకు, చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా ఉపయోగపడుతుంది. క్యారెట్లను ఉడికించడం వల్ల అందులోని బీటా-కెరోటిన్ కొంతవరకు తగ్గిపోవచ్చు. కాబట్టి, వీటిని ఎక్కువగా పచ్చిగా తినేందుకు ట్రై చేయండి. ఇలా తినడం వల్ల పూర్తి విటమిన్లు అందడమే కాకుండా మంచి రుచిని కూడా ఇస్తాయి.

2 / 5
పాలకూర: పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. అయితే, దీనిని ఉడికించడం వల్ల అందులోని విటమిన్-C గణనీయంగా తగ్గిపోతుంది. పచ్చి పాలకూరలో నీటిలో కరిగే విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేసే లూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉండికించి తినడం కంటే పచ్చిగా తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందట.

3 / 5
 బ్రోకలీ: బ్రోకలీలో విటమిన్-C, ఫైబర్, సల్ఫోరాఫేన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీన్ని  ఉడికించినప్పుడు వేడి వల్ల ఇందులో ఉండే విటమిన్-C దెబ్బతినడమే కాకుండా, క్యాన్సర్ నిరోధక గుణాలున్న సల్ఫోరాఫేన్ పరిమాణం కూడా ఘననీయంగా తగ్గుతుంది. కాబట్టి బ్రోకలీని సలాడ్లలో పచ్చిగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

4 / 5
క్యాప్సికమ్ : వీటిలో విటమిన్-C చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. కానీ వీటిని ఉడికించడం వల్ల క్యాప్సికమ్‌లోని విటమిన్-C శాతం తగ్గిపోతుంది. వీటిని పచ్చిగా తినడం వల్ల పూర్తి పోషకాలతో పాటు శరీరానికి మేలు చేసే కెరోటినాయిడ్స్ కూడా అందుతాయి.

5 / 5
టమోటాలు : టమోటాలలో విటమిన్-C, పొటాషియం, లైకోపీన్ ఉంటాయి. నిజానికి టమోటాలను ఉడికించినప్పుడు లైకోపీన్ లభ్యత పెరుగుతుంది, కానీ విటమిన్-C మాత్రం తగ్గిపోతుంది. అందుకే మీ ఆహారంలో టమోటాలను అటు ఉడికించి, ఇటు పచ్చిగా రెండింటినీ చేర్చుకోవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు)

Follow Us