Health Care: తుమ్ములు వస్తే బలవంతంగా ఆపేస్తున్నారా.. ఎంత డేంజరో తెలుసా!

|

Nov 06, 2023 | 11:45 AM

సాధారణంగా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. ఎవరికైనా ఏ సందర్భంలోనైనా రావచ్చు. ఒక్కొక్కరికి జలుబు వల్ల కూడా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. తుమ్ములను పెద్దలు పునర్జన్మగా భావిస్తారు. అందుకు 'చిరంజీవ.. చిరంజీవ' అంటారు. తుమ్మడం వల్ల కాసేపు గుండె చప్పుడు ఆగిపోయి.. మళ్లీ మొదలు అవుతంది. సైన్స్ పరంగా కూడా ఈ విషయం నిజమని తేలింది. అయితే తుమ్మును అశుభంగా భావిస్తూంటారు. తుమ్మినప్పుడు ఎలాంటి పనులు చేయకూడదని పెద్దలు చెబుతూ..

1 / 5
సాధారణంగా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. ఎవరికైనా ఏ సందర్భంలోనైనా రావచ్చు. ఒక్కొక్కరికి జలుబు వల్ల కూడా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. తుమ్ములను పెద్దలు పునర్జన్మగా భావిస్తారు. అందుకు 'చిరంజీవ.. చిరంజీవ' అంటారు. తుమ్మడం వల్ల కాసేపు గుండె చప్పుడు ఆగిపోయి.. మళ్లీ మొదలు అవుతంది. సైన్స్ పరంగా కూడా ఈ విషయం నిజమని తేలింది. అయితే తుమ్మును అశుభంగా భావిస్తూంటారు. తుమ్మినప్పుడు ఎలాంటి పనులు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది పూర్వం నుంచి వస్తున్నదే. దీంతో కొంత మంది బలవంతంగా తుమ్మును ఆపేసుకుంటారు.

2 / 5
ఇలా తుమ్మును అర్థాంతరంగా ఆపేయడం వల్ల.. చాలా డేంజర్ అన్న విషయం చాలా మందికి తెలీదు. బలవంతంగా తుమ్మును ఆపడం వల్ల మెదడులోని నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉందట. అంతే కాదు ప్రాణాలు కూడా పోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
బలవంతంగా తుమ్మును ఆపే ప్రయత్నం చేస్తే.. చెవులలోని నరాలకు, మెదడులోని నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సైన్స్ పరంగా తుమ్ము అనేది శరీరానికి సంబంధించిన ఒక రిఫ్లెక్స్ చర్య. దాన్ని బలవంతంగా నియంత్రణ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం. కాబట్టి తుమ్మును బలవంతంగా ఆపుకోకండి.

4 / 5
తుమ్ము ఎందుకు వస్తుందంటే.. కొన్ని సార్లు ఏదైనా దుమ్మూ, ధూళి లేదా పదార్థాలు ముక్కు లోపలికి వెళ్లినప్పుడు నరాలు అసౌకర్యంగా ఉంటాయి. ఈ పదార్థాన్ని బయటకు పంపడానికి శరీరం తుమ్ముల రూపంలో రియాక్ట్ అవుతుంది. కొన్ని సార్లు అలెర్జీ ఉన్నా ఇలా తుమ్ములు వస్తాయి.

5 / 5
మీరు తుమ్మినప్పుడు.. శరీరం మొత్తం షాక్ అవుతుంది. మనం తుమ్మినప్పుడు ముక్కు నుండి, నోటి నుండి వచ్చే గాలి గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ఉంటుంది.తుమ్మేటప్పుడు కళ్లు కూడా మూసుకు పోతాయి. తుమ్మిన తర్వాత మాత్రమే తేలికగా అనిపిస్తుంది. అయితే తుమ్ములు ఎక్కువగా వస్తే మాత్రం వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. 