
జీలకర్ర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పోపు వేసేటప్పుడు దీనిని తప్పక వాడుతాము. ముఖ్యంగా పప్పు, చట్నీని తాలింపు వేసేటప్పుడు జీలకర్రను వాడుతాము.

ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను దానిలో వేసి రాత్రంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయం వాటిని వడకట్టి ఆ నీటిని తాగితే చాలా మంచిదని చెబుతున్నారు.

మెరుగైన జీర్ణక్రియ: జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మీరు వీటిని వారం రోజుల పాటు తాగితే ఎసిడిటి, కడుపు నొప్పి, జీర్ణ సంబధిత సమస్యలు రాకుండా చేస్తాయి. లేట్ గా తినే వారికీ ఇది చిట్కా బాగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి.

షుగర్ లెవల్స్: జీలకర్రలో ఉండే కొన్ని పదార్థాలు ఇన్సులిన్ ను మెరుగుపరస్తుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూసుకుంటుంది. అయితే, ఇది డయాబెటిస్‌కు సమస్య కు చెక్ పెడుతుంది. అయితే, దీనిని తాగే ముందు డాక్టర్ ను సంప్రదించి తాగడం మంచిది.

తలనొప్పి : జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పని ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మగవాళ్ళలో క్రమంగా పెరుగుతున్న ఒత్తిడి, తలనొప్పి రాకుండా చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.