
హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే, చాలా మంది ఈ రోజు శివాలయాలకు వెళ్ళి శివునికి ఉపవాస దీక్షలు చేస్తారు. పరమ శివుని అనుగ్రహం కోసం కొందరు జాగారం కూడా చేస్తారు. ప్రతి యేటా ఈ మహాశివరాత్రి పండుగను మాఘమాసం కృష్ణ పక్షంలో చతుర్థశి నాడు జరుపుకుంటారు.

ఈ ఏడాది మహాశివరాత్రిని నేడు జరపుకుంటున్నారు. అయితే, మీ ప్రియమైన వారికి, స్నేహితులకు ఇలా సింపుల్‌గా మహాశివత్రి విషెస్ చెప్పండి. మరి, ఆ విషెస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

శివుడు అనుకంటే లెక్కలన్నీ మార్చగలడు, అలాగే నడుస్తున్న దారిని పూల బాటలా చేయగలడు. నమ్మకంతో ఆ శివుణ్ణి పూజించండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 2026

జీవితంలో ఏది శాశ్వతం కాదని నువ్వు తెలుకున్న రోజు నీ జీవితం చాలా మారుతుంది. భక్తితో నన్ను శివుణ్ణి స్మరిస్తూ ఉండండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు 2026

కష్టాలు అన్నాక మనిషికే వస్తాయి. వాటిని చూసి భయపడి ఆగిపోకండి. జీవితంలో ఏదో నేర్చుకోవాలనే ఆ పరమశివుడు ఆడే ఆట అది. ఓపికతో శివ శివ అంటూ ఆ శివుణ్ణి పూజిస్తూ ఉండండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు