Home Made Hair Pack: మాటిమాటికీ జుట్టు రాలిపోతుందా? గుడ్డుతో ఈ హెల్దీ హెయిర్ ప్యాక్‌ ట్రై చేయండి

| Edited By: Ravi Kiran

Jul 08, 2024 | 8:52 AM

మన జుట్టు కెరాటిన్, అమినో యాసిడ్స్‌తో నిర్మితమై ఉంటుంది. ఇతర రసాయనాలు, కాలుష్యానికి గురికావడం, సూర్యరశ్మికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల జుట్టుకు సహజ సిద్ధంగా ఉండే ప్రోటీన్ విచ్ఛిన్నమవుతుంది. దీంతో జుట్టు రూట్ నుంచి బలహీనంగా మారుతుంది. మెరుపును కోల్పోయి, రాలిపోతుంది. తల దువ్వుకుంటే చాలా వెంట్రుకలు రాలిపోతాయి. దీనికి ముఖ్యమైన కారణాలలో ఒకటి ఆహారంలో అవసరమైన..

1 / 5
 మన జుట్టు కెరాటిన్, అమినో యాసిడ్స్‌తో నిర్మితమై ఉంటుంది. ఇతర రసాయనాలు, కాలుష్యానికి గురికావడం, సూర్యరశ్మికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల జుట్టుకు సహజ సిద్ధంగా ఉండే ప్రోటీన్ విచ్ఛిన్నమవుతుంది. దీంతో జుట్టు రూట్ నుంచి బలహీనంగా మారుతుంది. మెరుపును కోల్పోయి, రాలిపోతుంది.

2 / 5
తల దువ్వుకుంటే చాలా వెంట్రుకలు రాలిపోతాయి. దీనికి ముఖ్యమైన కారణాలలో ఒకటి ఆహారంలో అవసరమైన పోషకాలు లేకపోవడం. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం సమతుల్యంగా ఉండాలి. పప్పులు, కూరగాయలు, చేపలు, మాంసం తప్పనిసరిగా తినాలి.

3 / 5
ఆరోగ్యకరమైన మెరిసే జుట్టు కోసం ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్ ప్యాక్‌లను ట్రై చేయాలి. ఏడాది పొడవునా ఇవి జుట్టు సంరక్షణకు ఉపయోగపడతాయి. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

4 / 5
గుడ్డు తెల్లసొన, కొబ్బరి లేదా ఆలివ్ నూనె, తేనెతో ప్యాక్ తయారు చేసుకోవాలి. గుడ్ల వాసన నచ్చనివారు ఈ ప్యాక్‌లో మీకు నచ్చిన ఏదైనా ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలపవచ్చు. ఈ పేస్ట్‌ను తల, స్కాల్ప్ మొత్తం అప్లై చేసి అరగంట సేపు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

5 / 5
చుండ్రు సమస్య ఉంటే అందులో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. వారానికి ఒకసారి దీనిని అప్లై చేయాలి. గుడ్డు వాసన తట్టుకోలేని వారు పెరుగుతో ఈ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు.