Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు

Updated on: Aug 25, 2026 | 4:28 PM

Green Tea Side Effects: ఆరోగ్యం కోసం గ్రీన్ టీ తాగేవారు దాని ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలను కూడా తెలుసుకోవాలి. ఇది యాంటీ ఆక్సిడెంట్లను పెంచి, మధుమేహం, మెదడు పనితీరు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే భోజనం చేసిన వెంటనే లేదా ఖాళీ కడుపుతో తాగితే జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, గ్యాస్ వంటి ఇబ్బందులు వస్తాయి.

1 / 5
ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్ టీని తాగుతున్నారు. రుచి నచ్చకపోయినా, దాని ప్రయోజనాల కోసం తాగడం అలవాటు చేసుకుంటున్నారు. గ్రీన్ టీలో ముఖ్యంగా కాటెచిన్లు అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల నష్టం నుంచి రక్షించి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

2 / 5
గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం, చర్మంపై సానుకూల ప్రభావాలు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు టైప్ 2 డయాబెటిస్ సమస్యను కూడా దూరం చేస్తాయి.

3 / 5
అయితే, గ్రీన్ టీని సరైన పద్ధతిలో తీసుకోకపోతే సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు... కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతారు. దీనివల్ల ఆరోగ్యకర పోషకాలను శరీరం గ్రహించడం కష్టమవుతుంది. పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ, భోజనం తర్వాత వెంటనే గ్రీన్ టీ తీసుకోవడం జీర్ణక్రియకు హాని కలిగించి, అజీర్తికి కారణమవుతుంది.

4 / 5
మరికొంతమంది ఉదయాన్నే ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతారు. ఈ పద్ధతి శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో తాగితే వికారం, కడుపులో యాసిడ్ పెరిగి, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

5 / 5
గ్రీన్ టీలోని టానిన్లు ఈ ప్రభావాలకు ప్రధాన కారణం. కాబట్టి గ్రీన్ టీని ప్రయోజనకరంగా మార్చుకోవాలంటే, సరైన సమయాల్లో, సరైన పద్ధతిలో తీసుకోవడం ముఖ్యమని.. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us